15 Years For Pokiri Movie: ట్రెండ్ సెట్టర్.. పోకిరి సంచలనానికి 15 ఏళ్లు.. ఇప్పుడు.. ఎప్పుడూ మైండ్ బ్లాకే…

Pokiri Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు.. పూరి జగన్నాథ్ కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ‘పోకిరి’.

15 Years For Pokiri Movie: ట్రెండ్ సెట్టర్.. పోకిరి సంచలనానికి 15 ఏళ్లు.. ఇప్పుడు.. ఎప్పుడూ మైండ్ బ్లాకే...
Pokiri Movie
Follow us

|

Updated on: Apr 28, 2021 | 4:38 PM

Pokiri Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు.. పూరి జగన్నాథ్ కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ‘పోకిరి’. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మహేష్ బాబును స్టార్‌డమ్‌ను మరింత పెంచింది కూడా ఈ సినిమానే. అందుకే ఈ సినిమా క్రేజ్ ఇప్పటికీ.. తెలుగు ప్రేక్షకుల్లో తగ్గలేదు. ఈ సినిమా గుర్తుకొచ్చినప్పుడల్లా.. ‘‘ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండు బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు.’’ అంటూ చాలామంది డైలాగులు కూడా చెబుతుంటారు. అయిేత.. ఇప్పటికీ పోకిరి సినిమా టీవీలో వచ్చినా.. సరే అందరూ అలా టీవీకే అతుక్కుపోతుంటారు. అయితే.. ఈ సూపర్ డూపర్ హిట్ సినిమాకు 15 ఏళ్లు నిండాయి. సరిగ్గా.. 15 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసి సరికొత్త రికార్డును సృష్టించింది. అప్పట్లోనే దాదాపు 12కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 40 కోట్ల షేర్ వసూలు చేసింది. 200లకు పైగా కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోని సరికొత్త రికార్డును సృష్టించింది.

అయితే.. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్‌ వైష్టో అకాడమీ బ్యానర్‌.. మంజుల ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. అయితే.. పోకిరి చిత్రంతో మహేష్ .. ఇలియానా రేంజే మారిపోయిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో పూరి జగన్నాథ్ తన దర్శకత్వ మార్కును చూపించారు. ఇందులో మహేష్ బాబు డైలాగులు ఇప్పటికీ.. ఎప్పటికీ ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి. ఈ చిత్రం అనంతరం ఇలియానా స్టార్‌డమ్ కూడా మారిపోయింది. బ్రహ్మానందం కామెడీ.. నాజర్, ప్రకాశ్ రాజ్ యాక్షన్ సీక్వెన్స్ గొప్ప హైలైట్స్‌గా నిలిచి సక్సెస్‌లో కీలక భూమికను పోషించాయి. ఈ చిత్రం 299 కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకోగా.. 200 కేంద్రాల్లో వందరోజులు, 63 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శన చేసి రికార్డుల కెక్కింది పోకిరి. దీంతోపాటు ఇతర భాషల్లో కూడా రీమేకై అక్కడా సంచలనాలు సృష్టించింది.

ఈ సినిమాను తమిళంలో 2007లో విజయ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో పోక్కిరిగా రీమేక్ చేశారు. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా వాంటెడ్ తీశారు. బెంగాలీ, కన్నడ ఇలా ప్రతిచోట కూడా సినిమా సక్సెస్ సాధించి తన మార్కును నిలబెట్టుకుంది. అందుకే సినీ ఇండస్ట్రీలోని అందరూ పోకిరి సినిమా లాంటి సక్సెస్ కావాలంటూ పేర్కొంటుంటారు.

Also Read: కరోనాతో నా కుటుంబం పోరాడింది.. చాలా భయమేసింది.. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి… అవికా గోర్ ట్వీట్..

F3 Movie: సెంటిమెంట్‏ను నమ్ముకుంటున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. ఎఫ్ 3 సినిమా విడుదలయ్యేది అప్పుడేనా..