Nagarjuna with Akhil: టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టార్.. కొడుకుతో కలిసి సినిమా చేయనున్న నాగ్..
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు చాలానే వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో ... ఫ్యామిలీ మల్టీస్టారర్‌కు ఇప్పుడు రంగం సిద్ధమవుతోంది.
Nagarjuna with Akhil: టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు చాలానే వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో … ఫ్యామిలీ మల్టీస్టారర్‌కు ఇప్పుడు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఇప్పుడు మరో క్రేజీ మూవీకి రెడీ అవుతున్నారు. మనం సినిమాలో పెద్ద కొడుకు నాగచైతన్యతో కలిసి నటించిన నాగార్జున… ఇప్పుడు చిన్న కొడుకు అఖిల్‌తో కలిసి ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా కన్ఫార్మ్ చేశారు కింగ్.
లాక్ డౌన్ తరువాత వైల్డ్ డాగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నాగార్జున.. మంచి సక్సెస్ సాధించారు. రీసెంట్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా టాప్‌లో ట్రెండ్ అవుతూ రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్న నాగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు.ప్రజెంట్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్న నాగ్.. అఖిల్‌తో సినిమా ప్లానింగ్‌లో ఉందని చెప్పారు. అఖిల్ ఫస్ట్ మూవీలోనూ కొడుకు తో కలిసి చిందేశారు మన్మథుడు. అయితే నెక్ట్స్ ఇద్దరూ ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నామన్న హింట్ ఇచ్చారు కింగ్. అంతేకాదు సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ వర్క్ కూడా జరుగుతుందన్న నాగ్… ఈ మూవీ జూలై రెండో వారంలో స్టార్ట్ అవుతుందని ప్రకటించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :