ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా అప్డేట్.. దీపికా పదుకొనే షూటింగ్ లో జాయిన్ అయ్యేది అప్పుడేనా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను పూర్తి చేసిన డార్లింగ్ ఇప్పుడు

Nag Ashwin-Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను పూర్తి చేసిన డార్లింగ్ ఇప్పుడు సలార్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక సలార్ విషయానికొస్తే కేజీఎఫ్ సినిమా తో సంచలన విజయం అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. సలార్ తో పాటు ఆదిపురుష్ సినిమాను కూడా బాలన్స్ చేస్తూ ఫినిష్ చేస్తున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కస్తున్నాడు.
మరో వైపు మహానటి ఫెమ్ నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించనుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.నాగ్ అశ్విన్ సినిమా అక్టోబర్ నెలలో ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్లో హీరోయిన్ దీపికా పాల్గొనబోతుందని టాక్. ప్రస్తుతం దీపికా షారుఖ్ ఖాన్ సరసన పఠాన్ అనే సినిమా చేస్తోంది. అక్టోబర్ లోపు ఆ సినిమాను ఫినిష్ చేసి ప్రభాస్ సినిమాలో జాయిన్ అవుతుందని ఫిలిం నగర్ టాక్.
మరిన్ని ఇక్కడ చదవండి :




