AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun’s Pushpa: రికార్డులు సృష్టిస్తున్న పుష్పారాజ్ ఇంట్రడక్షన్ వీడియో..20 రోజుల్లోనే..

ఇటీవలే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Allu Arjun's Pushpa: రికార్డులు సృష్టిస్తున్న పుష్పారాజ్ ఇంట్రడక్షన్ వీడియో..20 రోజుల్లోనే..
Rajeev Rayala
| Edited By: |

Updated on: Apr 28, 2021 | 10:16 AM

Share

Allu Arjun’s Pushpa: ఇటీవలే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకోసం బన్నీ అభిమానులతో పాటు సినీలవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్నడూ చేయని ఓ డిఫరెంట్ పాత్రలో బన్నీ కనిపించనున్నాడు. ఇక బన్నీ లుక్ కూడా ఊర మాస్ గా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఓ రేంజ్ హైప్ ను క్రియేట్ చేసాయి. రంగస్థలం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పుష్ప పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్  నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన  నటిస్తుంది. గిరిజన యువతి పాత్రలో ఈ అమ్మడు కనిపించనుందని టాక్. అలాగే అనసూయ కూడా పుష్పలో కీలక పాత్రలో నటించనుందట.

పుష్పారాజ్ ఇంట్రడక్షన్ వీడియో అంటూ ఇటీవల ఓ వీడియోను చిత్రయూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. విడుదలైన కొద్దీ గంటల్లోనే మిలియన్ వ్యూస్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. విడుదలైన 20 రోజుల్లో 50 మిలియన్స్ వ్యూస్ రాబట్టి టాలీవుడ్ లోనే ఫాస్ట్ 50మిలియన్స్ బ్రేక్ చేసిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగష్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

బాడీ షేమింగ్ గురించి ఓపెన్ అయిన ‘బర్ఫీ’ బ్యూటీ..! తన పన్నేండేళ్ల వయసు నుంచే అనుభవిస్తోందట..!

Rashmika Mandanna: మేడ‌మ్ హాలివుడ్ ఎంట్రీ ఎప్పుడు.. ఆమె మాటల్లోనే తెలుసుకుందాం ప‌దండి

పవన్ కల్యాణ్ ‘ఖుషీ’కి ఇరవై ఏళ్లు..! ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్న జనసేన ఫ్యాన్స్‌..

Follow Us
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే