Fatima Sana Shaikh: సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన బాలీవుడ్ బ్యూటీ.. కారణం ఇదే..
సినిమా తరాలకు సోషల్ మీడియాతో విడదీయరాని బంధం ఉంది. సినిమాలతో పోల్చుకుంటే సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు ఎక్కువ చేరువగా ఉంటున్నారు సెలబ్రిటీలు.
Fatima Sana Shaikh: సినిమా తరాలకు సోషల్ మీడియాతో విడదీయరాని బంధం ఉంది. సినిమాలతో పోల్చుకుంటే సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు ఎక్కువ చేరువగా ఉంటున్నారు సెలబ్రిటీలు. నిత్యం తమ సినిమాకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న నేపధ్యలో కరోనా మహమ్మారి పై అవగాహనా కల్పిస్తూ. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు కొందరు సినిమా తారలు. ఈ నేపథ్యంలో ఓ అమ్మడు ఉన్నట్టుండి సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పింది. బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ కూడా కరోనా గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అయితే తాజాగా ఈ బ్యూటీ కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఫాతిమా.. దంగల్ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది.
అయితే ఫాతిమా సనా గతంలో కూడా కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంది. 2019లో ఎక్కువగా సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతుండటంతో కొంతకాలం బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు కరోనా వ్యాప్తిని చూడాలకే సోషల్ మీడియాకు కొంతకాలం గుడ్ బై చూపిందని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇంస్టాగ్రామ్ లో అమ్మడికి 2.5 మిలియన్స్ పైగా ఫాలోయింగ్ కలిగి ఉంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోస్ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక ఇటీవలే ఈ ఆముద్దుగుమ్మ కరోనా బారిన పడి కోలుకుంది. అజిబ్ దస్తాన్ ప్రమోషన్స్ టైంలో కరోనా బారినపడి కోలుకుంది ఫాతిమా సనా.
మరిన్ని ఇక్కడ చదవండి :