Trivikram: ఈసారి గురూజీ గురి తప్పిందా?…మాటల మాంత్రికుడికి ఏమైందసలు? నెక్ట్స్ ఏంటి..?

కాస్త గ్యాప్ దొరగ్గానే హమ్మయ్య... పెండింగ్ పనులన్నీ చక్కబెట్టుకోవచ్చు.. అని రిలాక్స్ అవుతాం. కానీ.. డైరెక్టర్ త్రివిక్రమ్ విషయంలో మాత్రం కథ వేరేగా వుంది. ఈ గ్యాప్ లోనే ఆయనకున్న....

Trivikram: ఈసారి గురూజీ గురి తప్పిందా?...మాటల మాంత్రికుడికి ఏమైందసలు? నెక్ట్స్ ఏంటి..?
Trivikram Srinivas
Ram Naramaneni

|

Apr 28, 2021 | 7:58 PM

కాస్త గ్యాప్ దొరగ్గానే హమ్మయ్య… పెండింగ్ పనులన్నీ చక్కబెట్టుకోవచ్చు.. అని రిలాక్స్ అవుతాం. కానీ.. డైరెక్టర్ త్రివిక్రమ్ విషయంలో మాత్రం కథ వేరేగా వుంది. ఈ గ్యాప్ లోనే ఆయనకున్న పెండింగ్ పనులన్నీ ఒకటొకటిగా పేరుకుపోతున్నాయి. అసలు ఆయనేం చేస్తున్నారు అని ఆరా తీస్తే ఎవ్వరికీ సరైన క్లారిటీ రాని పరిస్థితి. మాటల మాంత్రికుడికి ఏమైందసలు?

ఆయన ఎక్కడికెళ్తున్నారో ఆయనకే తెలీడం లేదని ఆరోజు ఎందుకన్నారో గానీ.. ఇప్పుడు ఆయన సినిమాల లైనప్ ని పరిశీలిస్తే.. ఆ మాట నిజమే అనిపిస్తోంది ఆయన అభిమానులకు. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత.. అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ తో బిగ్ రేంజ్ లో బౌన్స్ బ్యాక్ అయ్యారు త్రివిక్రమ్. వాట్ నెక్స్ట్ అంటే మాత్రం.. ఇప్పటికైతే క్రిస్టల్ క్లియర్ ఆన్సర్ లేనే లేదక్కడ.

దాదాపు ఏడాదిన్నరవుతోంది త్రివిక్రమ్ మెగాఫోన్ పట్టుకుని. అందరికీ కోవిడ్ తో గ్యాప్ వచ్చినా త్రివిక్రమ్ కి వచ్చింది మాత్రం విచిత్రమైన గ్యాప్. తారక్ 30వ‌ మూవీ కోసం బౌండెడ్ స్క్రిప్ట్ చేతిలో పెట్టుకుని అనౌన్స్ మెంట్ ఇచ్చేసినా.. ఈక్వేషన్లు మారిపోవడంతో ఆ ప్రాజెక్ట్ సడన్ గా ఆగిపోయింది. ఇలా వచ్చిన గ్యాప్ ని మాటలతో ప్యాచప్ చేద్దామని పవన్-రానా సినిమాకు డైలాగ్స్ రాస్తూ కూర్చున్నారు గురూజీ.

పదేళ్ల కిందట పవర్ స్టార్ ని దృష్టిలో పెట్టుకుని రాసిన కోబలి కథకు… ఇప్పటి ఇమేజ్ కి తగ్గట్టు రిపేర్లు చేస్తున్నట్టు ఫీలర్లొచ్చాయి. కానీ ఆ కథను మరో హీరో కోసం మరో డైరెక్టర్ దగ్గర అమ్మకానికి పెట్టారన్నది తాజా ఊసు. ఇక.. విక్టరీ హీరో వెంకీతో గతంలో అనౌన్స్ చేసిన సినిమా.. ఆ తర్వాత సోయిలోనే లేదు. ఆ కథ పక్కన పెట్టి… ఇప్పుడు వెంకీమామ 75వ మూవీ కోసం కొత్త కథ రాస్తున్నట్టు టాక్.

కథ, స్క్రీన్ ప్లే, మాటలు సరే.. త్రివిక్రమ్ డైరెక్షన్ సంగతేంటి? ఆరు సినిమాలతో పవర్ ప్యాక్డ్ గా వున్న పవన్ లైనప్ లో త్రివిక్రమ్ ఊసే లేదు. అటు… తారక్-త్రివిక్రమ్ మూవీ అటకెక్కలేదు.. ఏ క్షణంలోనైనా గురూజీ సీన్లోకొస్తారు అని ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ ఇస్తున్నారు. ఇటు.. హ్యాట్రిక్ షాట్ కొడదాం రా అని సూపర్ స్టార్ ఇచ్చిన పిలుపు త్రివిక్రమ్ చెవిన పడిందా లేదా అనే క్లారిటీ కూడా లేదు. మే నెలాఖరులో మహేష్-త్రివిక్రమ్ మూడో సినిమా అనౌన్స్ మెంట్ వస్తోందన్నది జస్ట్ టాక్ మాత్రమే, ఈ గజిబిజి మొత్తాన్నిగమనిస్తున్న ఫ్యాన్స్ కి…ఈసారి గురూజీ గురి తప్పిందా? అనే డౌట్ ఎందుకు రాదు చెప్పండి?

Also Read: ఏపీలో క‌రోనా క‌ల్లోలం.. కొత్తగా 14,669 కేసులు, 71 మరణాలు

పీఎం కేర్స్ ఫండ్ నుంచి లక్ష పోర్టబుల్ కాన్సెంట్రేటర్లు, 500 ఆక్సిజన్ ప్లాంట్లు, ప్రధాని మోదీ వెల్లడి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu