AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ నటించిన ఆ సినిమా డిజాస్టర్ అవుతుందని కృష్ణ ముందే చెప్పారట..!!

తెలుగు సినిమా చెరిత్రలో కృష్ణది ఒక ప్రత్యేక ఒరవడి. అప్పటి స్టార్ హీరోలకు పోటీ ఇస్తూ.. ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనిపంచుకున్నారు కృష్ణ.

Mahesh Babu: మహేష్ నటించిన ఆ సినిమా డిజాస్టర్ అవుతుందని కృష్ణ ముందే చెప్పారట..!!
Krishna, Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Nov 19, 2022 | 5:59 PM

Share

సూపర్ స్టార్ కృష్ణ మరణన్ని ఇప్పటికి అభిమానులు, కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. 350కు పైగా సినిమాల్లో నటించి తెలుగు కళామ్మా ముద్దుబిడ్డగా ఎదిగారు సూపర్ స్టార్ కృష్ణ. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తేనెమనసులు నుంచి మొదలు పెట్టిన ఆయన ప్రస్థానం అజరామరంగా సాగింది. తెలుగు సినిమా చెరిత్రలో కృష్ణది ఒక ప్రత్యేక ఒరవడి. అప్పటి స్టార్ హీరోలకు పోటీ ఇస్తూ.. ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనిపంచుకున్నారు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఒక తరం ముగిసింది. కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నారు. అయితే ఈ ఏడాది మహేష్ కు కోలుకోలేని దెబ్బలు తగిలాయి. ఇదే ఏడాది ముగ్గురు కుటుంబసభ్యులను కోల్పోయాడు మహేష్.  అన్న, అమ్మ, నాన్న ఇలా ముగ్గురిని వెంటవెంటనే కోల్పోయాడు మహేష్. తన తండ్రి గురించి మహేష్ సందర్భం వచ్చిన ప్రతిసారి ఎంతో గొప్పగా చెప్తుంటారు.

ఆయనే తనకు దేవుడు అని మహేష్ చెప్తుంటారు. ఇక మహేష్ సినిమాల విషయంలోనూ కృష్ణా జడ్జ్మెంట్ కరెక్ట్ గా ఉంటుందట. ఒక సినిమా చూసిన తర్వాత ఆ సినిమా ఆ హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా అన్నది మొహం మీదే చెప్పేస్తారట కృష్ణ. మురారి సినిమా సమయంలో ఆ సినిమా చూసిన కృష్ణ  మహేష్ బుజం పై చేయివేసి గర్వంగా ఫీల్ అయ్యారట ఇదే విషయాన్నీ మహేష్ పలు సందర్భాల్లో తెలిపారు.

అయితే మహేష్ బాబు నటించిన నాని సినిమా గురించి కృష్ణ  చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన నాని సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాను ముందుగానే చూసిన కృష్ణ  మహేష్ తో ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారట. ఆ తర్వాత ఈ సినిమా హిట్ అయితే మహేష్ స్టార్ కాదు. ఈ సినిమా ప్లాప్ అయితే మహేష్ స్టార్’ అని చెప్పారట. కృష్ణ చెప్పినట్టే నాని సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. కృష్ణ జడ్జ్మెంట్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుందట.

ఇవి కూడా చదవండి
Nani

Nani

కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!
ఒక్కసారి ఛార్జింగ్‌తో 110 కి.మీ రేంజ్‌.. ధర ఎంతో తెలుసా?
ఒక్కసారి ఛార్జింగ్‌తో 110 కి.మీ రేంజ్‌.. ధర ఎంతో తెలుసా?
రాజయోగం పట్టనుంది.. రాసిపెట్టుకోండి ఫిబ్రవరిలో ధనవంతులు వీరే
రాజయోగం పట్టనుంది.. రాసిపెట్టుకోండి ఫిబ్రవరిలో ధనవంతులు వీరే
ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..
ప్రేమంటే ఇదేరా.. రెండు హృదాయాలను కలిపే అద్భుతమైన కానుక..
మెట్రో స్టేషన్‌లో జంట ఎంగేజ్‌మెంట్‌.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు!
మెట్రో స్టేషన్‌లో జంట ఎంగేజ్‌మెంట్‌.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు!
నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..
నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..
ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?