AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaalodu Review: కింద నుంచి వచ్చావ్ సుధీర్.. ఒప్పుకుంటాం.. కానీ నేల విడిచి సాము చేయకు

‘జబర్దస్త్’ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకుని.. బుల్లితెర స్టార్ యాంకర్‌గా ఎదిగిన సుడిగాలి సుధీర్.. వెండితెరపై కూడా హీరోగా రాణించేందుకు తెగ ఆరాటపడుతున్నాడు. ఆతని ప్రయత్నం మంచిదే కానీ.. ఫలితాలపై కూడా విశ్లేషణ అవసరం.

Gaalodu Review: కింద నుంచి వచ్చావ్ సుధీర్.. ఒప్పుకుంటాం.. కానీ నేల విడిచి సాము చేయకు
Sudigali Sudheer
Ram Naramaneni
|

Updated on: Nov 19, 2022 | 6:03 PM

Share

కింద నుంచి వచ్చావ్ సుధీర్ ఒప్పుకుంటాం.. కానీ నేల విడిచి సాము చేస్తే ఎలా..? గాలోడు చిత్రం చూసిన తర్వాత కలిగిన అభిప్రాయం ఇది. కేవలం డ్యాన్స్‌లు, ఫైట్‌లు ఉంటే సరిపోతుందా..? కథ వద్దా..? కనీసం కథనం అయినా కొత్తగా చెప్పాలి కదా..?. సుధీర్.. నువ్వు కామెడీ యాక్టర్, డ్యాన్సర్, హోస్ట్.. వీటన్నింటి కంటే ముందు మెజీషియన్.. నిజంగా నువ్వు చాలామందికి ఇన్స్‌స్పిరేషన్. కానీ ఇదేం సినిమా. ఒకేసారి మాస్ హీరో ఇమేజ్ రావాలంటే ఎలా చెప్పు. పెద్ద.. పెద్ద స్టార్ హీరోల సినిమాలలో కంటెంట్ లేకపోతేనే.. నిర్మోహమాటంగా మొదటి రోజే తిరస్కరిస్తున్నారు జనాలు. అలాంటిది సిల్వర్ స్క్రీన్‌పై నిలదొక్కుకోవాలనుకుంటున్న నువ్వు ఇలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటే ఎలా..?. యూట్యూబ్‌లో కామెంట్స్ పెట్టినవారందరూ థియేటర్స్‌కు రారు. సినిమాలో కంటెంట్ ఉంటే.. అందరూ మూవీని ఆదరిస్తారు. ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు. పదే.. పదే జరిగితే తప్పే అంటారు. సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్, ఇప్పుడు గాలోడు… మూడు సినిమాల్లో కంటెంట్ ఏముందని ఆత్మవిమర్శ చేసుకో ఒకసారి.

కథ:

ముఖ్యంగా గాలోడు కథ విషయానికి వస్తే.. హీరో రాజు (సుడిగాలి సుధీర్) ఓ పల్లెలో పెరిగిన దురుసు కుర్రోడు. పేకాట గొడవలో సర్పంచ్‌ కొడుకును కొట్టడంతో.. అతడు చనిపోతాడు. దీంతో ఊరు వదిలి హైదరాబాద్ చెక్కేస్తాడు. సిటీ వచ్చిన అతనికి హీరోయిన్ శుక్లా (గెహనా సిప్పి)తో పరిచయం అవుతుంది. ఆమె అతడికి తన తండ్రి వద్ద కార్ డ్రైవర్‌గా జాబ్ ఇప్పిస్తుంది. ఆపై వీరి మధ్య ప్రేమ పుడుతుంది. ఈ క్రమంలోనే పోలీసులు సిటీకి వచ్చి రాజును అదుపులోకి తీసుకుంటారు..? ఆపై శిక్ష పడుతుంది..? మరి హీరో జైలు నుంచి ఎలా బయటపడ్డాడు. అతని ప్రేమ కథ ఏమయ్యింది..?  అతడికి సాయం చేసింది ఎవరు అన్నది మిగతా కథ.

ఎవరెవరు ఎలా చేశారు :

సుధీర్ కష్టపడ్డాడు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేశాడు. కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గెహనా సిప్పీ తన క్యూట్ లుక్స్‌తో బాగా ఆకట్టుకుంది. సప్తగిరి తన పాత్ర పరిధి మేరకు బాగా చేశాడు. షకలక శంకర్ కామెడీ డోస్ కాస్త ఎక్కువయినట్లు అనిపించింది. పృథ్వీ రాజ్, ఆధ్య,  రవిరెడ్డి వంటివారు ఓకే అనిపిస్తారు. తమ్మారెడ్డి భరద్వాజ స్పెషల్‌ రోల్‌లో ఆకట్టుకున్నారు.

టెక్నిషియన్స్ :

ముఖ్యంగా దర్శకుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌ గురించి మాట్లాడుకోవాలి. అతను కథపై కనీస శ్రద్ధ పెట్టలేదని అనిపించింది. ఏదో టీవీకి రాసుకునే ట్రాకులు రాసుకోని.. సినిమా తీసేశాడు. సూట్ అవుతుందో లేదో చూడకుండా హీరోని ప్రతి సీన్‌లో ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, నేపథ్య సంగీతమూ యావరేజ్‌గా ఉంది. రాంప్రసాద్ సినిమాటోగ్రఫి కూడా చాలా క్లియర్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఓకే. యాక్షన్ సీక్వెన్సులు మాత్రం చాలా బాగున్నాయి.

ఫైనల్‌గా: 

గాలోడు గాలివాటంగా వెళ్లిపోయాడు. మంచి కథ సెలక్ట్ చేసుకుని ఉంటే బాగుండేది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు