AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smitha Songs: మసక మసక చీకటిలో.. 90’s రొమాంటిక్ సాంగ్.. కొత్త వెర్షన్ విన్నారా..?

సింగర్ స్మిత... ఒకప్పుడు వరుస పాటలతో శ్రోతలను అలరించారు. అటు సింగర్ గా.. ఇటు నటిగానూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కానీ చాలా కాలంగా స్మిత నుంచి మరో సాంగ్ రాలదు. తాజాగా ఇప్పుడు ఆమె 90's రొమాంటిక్ సాంగ్ 'మసక మసక చీకటిలో'పాటను ర్యాప్ మిక్స్ చేసి విడుదల చేశారు. ఇప్పుడు ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

Smitha Songs: మసక మసక చీకటిలో.. 90's రొమాంటిక్ సాంగ్.. కొత్త వెర్షన్ విన్నారా..?
Smitha
Rajitha Chanti
|

Updated on: Dec 14, 2025 | 10:15 AM

Share

“మసక మసక చీకటిలో.. మల్లెతోట వెనకాల.. మసక మసక చీకటిలో .. మల్లెతోట వెనకాల.. మాపటేళకలుసుకో… నీ మనసైనది దొరుకుతుంది.. నీ మనసైనది దొరుకుతుంది.. ” అప్పట్లో ఈ సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. 1973లో విడుదలైన దేవుడు చేసిన మనషులు సినిమాలోని ఈ పాట అప్పట్లో సంచలనం. ఇప్పుడు ఇదే పాటకు ర్యాప్ మిక్స్ చేసి న్యూట్రెండ్ కు తగినట్లుగా రిలీజ్ చేశారు సింగర్ స్మిత. క్వీన్ అఫ్ పాప్ సింగర్ స్మిత ఓజి×మసక మసక సాంగ్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. స్మిత, నోయల్ నటించిన ఈ సాంగ్ ని విజయ్ బిన్నీ అద్భుతంగా డైరెక్ట్ చేశారు. జార్జ్. సి. విలియమ్స్ అదిరిపోయే విజువల్స్ అందించారు. నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా చేసిన ఈ పాటకి అడెలె ఎడిటర్. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు దేవాకట్టా పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి :  Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో పాప్ సింగర్ స్మిత మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నాన్న ఒక థాట్ ని మొదలుపెట్టారు. అమ్మ నన్ను ఎంతగానో ప్రోత్సహించి తన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ని నా మీద పెట్టింది. హాయ్ రబ్బా ఆల్బమ్ అమ్మ ఇన్వెస్ట్మెంట్ తోనే వచ్చింది. దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఆ తర్వాత అంతా హిస్టరీ. అదే ఇంటి పేరుగా మారింది. ఇప్పుడు ఇంటిపేరు మార్చుకుని ‘ఓజి’ చేద్దామని అనుకున్నాం. 2026 లో నా లైఫ్ లో కేవలం మ్యూజిక్ మాత్రమే ఉండబోతుంది. మీ అందరూ కూడా అందులో భాగం కావాలని కోరుకుంటున్నాను. ఈ సాంగ్ ని నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీద లాంచ్ చేశారు. ఆయన కూడా నా జర్నీలో అన్ని రకాలుగా భాగమై ఉన్నారు. ఆయన ప్రోత్సాహం ఎంతో బలాన్ని ఇస్తుంది. నార్త్ ఇండిపెండెంట్ మ్యూజిక్ చాలా పాపులర్ అవుతుంది. సౌత్ లో మాత్రం నేను ఆపినచోటే ఆగిపోయింది. మళ్ళీ అలా ఆగకూడదని ఒక చిన్న బెంగ వచ్చింది. మళ్ళీ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నా. సంక్రాంతికి ఒక పాట వస్తుంది. మేమే పండగ తీస్తున్నాం. ఆ పాట ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది. ఇకపై వరుసగా పాటలు రాబోతున్నాయి. మార్చి చివరి నుంచి లైవ్ షోస్ కూడా ఉంటాయి. హైదరాబాద్, ఆంధ్రాలో రెండు లొకేషన్స్, యూఎస్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్ లో కూడా ఈవెంట్స్ ఉంటాయి” అని అన్నారు.

ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

ఇవి కూడా చదవండి

నోయల్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. స్మిత గారి కం బ్యాక్ అందరికంటే ఎక్కువగా హ్యాపీనెస్ నాకే వచ్చింది. ఎందుకంటే వారితో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకున్నాను. స్మిత గారు అంటే అందరికీ ఇష్టం. నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయడానికి ఇన్స్పిరేషన్ స్మిత గారు. ఇండిపెండెంట్ మ్యూజిక్ కి చాలా డెడికేషన్ కావాలి. ఈ పాటలన్నీ కూడా మేము చాలా డెడికేషన్ తో చేశాను. తప్పకుండా మీ అందర్నీ గొప్పగా అలరిస్తాయి.

ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : సుమన్ శెట్టి ప్రభంజనం.. బిగ్‏బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్.. 14 వారాలకు ఎంత సంపాదించాడంటే..

Follow Us