Bigg Boss 9 Telugu : సుమన్ శెట్టి ప్రభంజనం.. బిగ్‌బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్.. 14 వారాలకు ఎంత సంపాదించాడంటే..
బిగ్ బాస్ సీజన్.. ఇక ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు అనౌన్స్ చేసిన హోస్ట్ నాగ్.. శనివారం సుమన్ శెట్టి హౌస్ నుంచి బయటకు వచ్చారు. దాదాపు 14 వారాలు హౌస్ లో ఉండి గట్టి పోటీ ఇచ్చాడు సుమన్ శెట్టి. మొదటి నుంచి తన మాట తీరు.. ప్రవర్తనతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్నారు సుమన్ శెట్టి. ఎలాంటి నెగిటివిటీ లేకుండా 14 వారాల తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చాడు.

బిగ్ బాస్ సీజన్ 9..చివరి దశకు చేరుకుంది. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు అనౌన్స్ చేశారు హోస్ట్ నాగ్. దీంతో శనివారం సుమన్ శెట్టి ఎలిమినేటర్ అయ్యాడు. అయితే ఈసారి హౌస్ లో ఎలాంటి నెగిటివిటీ లేకుండా.. ఎవరితో ఒక మాట పడకుండా దాదాపు 14 వారాలు హౌస్ లో ఉన్నాడు సుమన్ శెట్టి. శనివారం నాటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేషన్ తర్వాత భరణి ఎమోషనల్ అయ్యాడు. బయటకు రాగానే మనిద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం… కలిసి షూటింగ్ చేస్తున్నాం అంటూ భావోద్వాగానికి గురయ్యాడు భరణి. ఆ తర్వాత సుమన్ శెట్టి ప్రభంజనం అంటూ భారీ ఎలివేషన్ ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్.
ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‌తో క్రేజ్.. క్యాన్సర్‌తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..
చివరకు అధ్యక్షా వెళ్లొస్తా అంటూ తన పాపులర్ డైలాగ్ చెప్పి బయటకు వచ్చేశాడు. వెళ్తూ వెళ్తూ మా భరణి అన్నను జాగ్రత్తగా చూసుకోండి అంటూ హౌస్మేట్స్ కు రిక్వెస్ట్ చేశారు. అనంతరం స్టేజ్ మీదకు వెళ్లిన తర్వాత.. ఫైనల్ వీక్ ముందు ఎలిమినేటర్ అయ్యావ్ కదా.. ఎలా ఉంది నాగ్ అడగ్గా.. హ్యాపీగానే ఉంది సార్.. ఒక్కవారం ఉంటే టాప్ 5కి వెళ్లేవాడ్ని అని అన్నాడు. ఆ త్రవాత సుమన్ శెట్టి ప్రభంజనం.. జర్నీ వీడియో చూద్దాం అంటూ ఎలివేషన్ ఇచ్చారు నాగ్. ఆ తర్వాత హౌస్ లోకి రావడం నుంచి చివరి వారం వరకు సుమన్ శెట్టి ఆట, తీరు ప్రవర్తన.. ఎమోషన్స్ చూపించారు. అనంతరం నాగ్ సైతం సుమన్ శెట్టి బ్యూటిపుల్ జర్నీ అంటూ ప్రశంసించారు. ఇక హౌస్ లో బొగ్గు ఎవరు.. ? బంగారం ఎవరు ? అని నాగ్ అడగ్గా.. బొగ్గు ఎవరు లేరని.. అందరూ బంగారాలనే అని మరోసారి తన మంచితనం బయటపెట్టాడు.
ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..
ఇదెలా ఉంటే.. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న సెలబ్రెటీ లిస్ట్ లో చేరిపోయారు సుమన్ శెట్టి. ఆయనకు రోజుకు రూ.45 వేల రెమ్యునరేషన్.. అంటే 14 వారాలకు గానూ 44 లక్షలు అందుకున్నట్లు సమాచారం. అదే నిజమైతే.. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న సెకండ్ సెలబ్రెటీ సుమన్ శెట్టి. ఇక ఆదివారం ఎలిసోడ్ లో భరణి ఎలిమినేటర్ అయ్యాడని టాక్.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..








