ప్రముఖ నటుడు అఖిల్ దుర్మరణం.. సొంత ఇంట్లోనే మృతదేహం లభ్యం!
రాష్ట్ర అవార్డు అందుకున్న నటుడు అఖిల్ విశ్వనాథ్ (30) అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అఖిల్ తన ఇంట్లోనే మృతి చెంది కనిపించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 2019లో కేరళ రాష్ట్ర అవార్డు గెలుచుకున్న..

త్రిస్సూర్, డిసెంబర్ 13: కేరళ రాష్ట్ర అవార్డు అందుకున్న నటుడు అఖిల్ విశ్వనాథ్ (30) అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అఖిల్ తన ఇంట్లోనే మృతి చెంది కనిపించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 2019లో కేరళ రాష్ట్ర అవార్డు గెలుచుకున్న ‘చోళ’ మువీలో తన పాత్రకుగాను అఖిల్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ‘ఆపరేషన్ జావా’ సహా పలు ప్రముఖ మువీల్లోనూ నటించాడు. విభిన్న పాత్రలు చేస్తూ అనతి కాలంలోనే అఖిల్ మంచి పేరు దక్కించుకున్నాడు.
కెరీర్ ప్రారంభంలో అఖిల్ తన సోదరుడు అరుణ్‌తో కలిసి ‘మాంగాండి’ అనే టెలిఫిలింలో నటించాడు. ఈ సినిమాలో అఖిల్ నటనకుగానూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ బాల నటుడి అవార్డును అందుకున్నాడు. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న అఖిల్.. ఏం జరిగిందో తెలియదుగానీ ఉన్నట్లుండి తన ఇంట్లో శవమై కనిపించాడు. మరోవైపు అఖిల్ తండ్రి విశ్వనాథ్ ఇటీవల జరిగిన ఓ మోటార్ సైకిల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అతని తల్లి గీత కొడాలి వ్యాపారి ఎకోపన సమితి వ్యాపారభవన్‌లో ఉద్యోగిని. అఖిల్ నటనతోపాటు కొడాలిలో మొబైల్ షాపు మెకానిక్‌గా కూడా పనిచేస్తున్నాడు. అయితే అతను కొంతకాలంగా షాపుకు కూడా వెళ్లడం లేదని సమాచారం. ఇంతలో అతడి మృతి వార్త స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని.. అఖిల్ మరణానికి కారణాలను కనుగొనేందుకు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








