Singer Mangli: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న మంగ్లీ.. అసలు విషయం చెప్పేసిన టాలీవుడ్‌ సింగర్‌

పాటల సంగతి పక్కన పెడితే.. ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ గురించి గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. సింగర్‌ మంగ్లీ త్వరలోనే పెళ్లి చేసుకోనుందని, తన బావతో కలసి ఏడడుగులు నడవనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అంగీకరించిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో మంగ్లీ ఉందని ప్రచారం జరుగుతోంది. తాజాగా తన పెళ్లి రూమర్లపై స్పందించిన మంగ్లీ..

Singer Mangli: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న మంగ్లీ.. అసలు విషయం చెప్పేసిన టాలీవుడ్‌ సింగర్‌
Singer Mangli
Follow us
Basha Shek

|

Updated on: Oct 05, 2023 | 6:10 AM

ప్రస్తుతం జానపద పాటలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది సింగర్‌ మంగ్లీ అలియాస్‌ సత్యవతి రాథోడ్. కెరీర్ ప్రారంభంలో ఓ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా చేసిన ఆమె తన తీయటి గాత్రంతో సంగీత ప్రియులను అలరిస్తోంది. ముఖ్యంగా మంగ్లీ ఆలపించే బతుకమ్మ, బోనాల పాటలకు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక ప్లే బ్యాక్‌ సింగర్‌గా టాలీవుడ్‌లోనూ తన దైన ముద్ర వేసుకుంది ట్యాలెంటెడ్‌ సింగర్‌. శైలజా రెడ్డి అల్లుడు, నీది నాకే ఒక కేథ, జార్జ్‌ రెడ్డి, అలా వైకుంఠ పురం, సిటీమార్‌, లవ్‌ స్టోరీ, రంగ్‌ దే, అల్లుడు అదుర్స్‌, క్రాక్‌, పెళ్లి సందడి, పుష్ప (కన్నడ), రౌడీ బాయ్స్‌, ధమకా, బలగం, భోళాశంకర్‌ తదితర సినిమాల్లో మంగ్లీ ఆలపించిన పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. కేవలం తెలుగులోనే కాదు కన్నడ సినిమాల్లోనూ తన గాత్రం వినిపిస్తోంది. పాటల సంగతి పక్కన పెడితే.. ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ గురించి గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. సింగర్‌ మంగ్లీ త్వరలోనే పెళ్లి చేసుకోనుందని, తన బావతో కలసి ఏడడుగులు నడవనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అంగీకరించిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో మంగ్లీ ఉందని ప్రచారం జరుగుతోంది. తాజాగా తన పెళ్లి రూమర్లపై స్పందించిన మంగ్లీ ఘొల్లున నవ్వేసింది.

‘ఏంటి? నాకు పెళ్లా? ఓరి దేవుడా.. కనీసం నాకు కూడా తెలియకుండానే నాకు పెళ్లి చేసేస్తున్నారా? ఇంతకీ బావతో ఏడడుగులు వేస్తున్నానంటున్నారు. అసలు నాకు తెలియక అడుగుతున్నా.. నాకే తెలియని నా బావ ఎవరో చెప్తారా? ఈ వార్తలు సృష్టించిన వాళ్లైనా దీనికి సమాధానం చెప్పండయ్యా’ అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేసింది మంగ్లీ. తద్వారా తన పెళ్లిపై వస్తోన్న వార్తలు పుకార్లేనని క్లారిటీ ఇచ్చేసింది. కాగా సింగర్‌గా సత్తా చాటుతున్న మంగ్లీ సత్యదేవ్‌ గువ్వా గోరింక, నితిన్‌ మ్యాస్ట్రో సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌తో సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

సైమా అవార్డుల ప్రదానోత్సవంలో సింగర్ మంగ్లీ..

View this post on Instagram

A post shared by Mangli Singer (@iammangli)

సింగర్ మంగ్లీ  లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Mangli Singer (@iammangli)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!