Miss Shetty Mr Polishetty: ఓటీటీలోకి వచ్చేసిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’.. ఎక్కడ చూడొచ్చంటే?
యువీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. పరిమిత బడ్జెట్‌లో నిర్మించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రూ. 50 కోట్లకు పైగా రాబట్టింది. ముఖ్యంగా సినిమాలో అనుష్క, నవీన్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఏజ్ పరంగా చాలా గ్యాప్ ఉన్నప్పటికీ ఈ జోడి అందరినీ ఆకట్టుకుంది
అందాల తార అనుష్కా శెట్టి, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి. డైరెక్టర్ మహేష్ బాబు తెరెకెక్కించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌లో పవిత్రా లోకేష్, మురళీ శర్మ, జయసుధ, నాజర్, భివన్ గోమటం, నాజర్, తులసి, రోహిణీ, మహేష్, సోనియా దీప్తి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. పరిమిత బడ్జెట్‌లో నిర్మించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రూ. 50 కోట్లకు పైగా రాబట్టింది. ముఖ్యంగా సినిమాలో అనుష్క, నవీన్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఏజ్ పరంగా చాలా గ్యాప్ ఉన్నప్పటికీ ఈ జోడి అందరినీ ఆకట్టుకుంది. ఎప్పటిలాగే అనుష్క తన దైన క్యూట్ యాక్టింగ్‌తో మెప్పించింది. ఇక ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ రోల్స్‌తో కితకితలు పెట్టిన నవీన్ పొలిశెట్టి ఈ సినిమాలో తన నటనతో కన్నీళ్లు తెప్పించాడు. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సూపర్ హిట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. గురువారం అర్ధరాత్రి (అక్టోబర్ 5 ) నుంచి అనుష్క, నవీన్‌ల సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలుగుతో పాటు తమిళ్, కనడ, మలయాళం, హిందీ భాషల్లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌కు రధన్, గోపీసుందర్ సంయుక్తంగా స్వరాలు సమకూర్చారు. నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. స్వతంత్ర్య భావాలున్న అన్విత (అనుష్కా శెట్టి) పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కనాలని అనుకుంటుంది. బిడ్డను కనేందుకు తగిన యువకుడి కోసం వెతుకుతుండగా అప్పుడే సిద్దూ పొలిశెట్టి ( నవీన్ పొలిశెట్టి) పరిచయమవుతాడు. అనుష్క నిర్ణయంతో నవీన్ పొలిశెట్టి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. వారిద్దరి ప్రయాణం ఎలా సాగింది? వారి బంధాన్ని సమాజం అంగీకరించిదా? లేదా? అన్నది తెలియాలంటే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను చూడాల్సిందే. మరి థియేటర్లలో ఈ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
#MissShettyMrPolishetty Now Streaming On @Netflix_INSouth Tel-Tam-Kan-Mal-Hin#MissShettyMrPolishettyOnNetflix pic.twitter.com/FrHyT2dlkM
— PANDA (@ottpandain) October 4, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.