Bigg Boss Season 7: టాస్క్‌లో ముదిరిన వివాదం..! అమ్మాయని చూడకుండా.. శోభను లాగి కిందపడేసిన ప్రిన్స్ యావర్‌..

అది గేమ్‌ అయినా.. టాస్క్‌ అయినా.. కొన్న లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని రూల్స్‌ ఉంటాయి. వాటి ప్రకారం ఆడితే పర్లేదు కానీ వాటిని ఫాలో అవకుడంగా ఆడితేనే అసలు గొడవ. ఇవ్వాల్టి అంటే 31st ఎపిసోడ్‌లోనూ.. ప్రిన్స్ యావర్ , శోభల మధ్య జరిగింది ఇలాంటి గొడవే! తన వస్తువు లాక్కుందని ప్రిన్స్.. లాక్కోవడంలో తప్పేముందని శోభ..! కట్ చేస్తే.. బల ప్రదర్శన చేసిన ప్రిన్స్.. అక్కడ నుంచి చేతులు తీయ్‌ అంటూ అరిచిన శోభ..! వెరసీ ఈ సీన్‌ బీబీ ఆడియెన్స్‌ను కాస్త నొప్పిస్తుంది. శోభ పై కోసం వచ్చేలా చేస్తుంది. ఎందుకంటే.. ఈ లొల్లి షురూ చేసింది ఈమే కాబట్టి.

Bigg Boss Season 7: టాస్క్‌లో ముదిరిన వివాదం..! అమ్మాయని చూడకుండా.. శోభను లాగి కిందపడేసిన ప్రిన్స్ యావర్‌..
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Oct 05, 2023 | 12:54 AM

‘గెలిపించేది మీ నవ్వే’ టాస్క్ తర్వత.. కంటెస్టెంట్స్‌కు సంచాలకులకు మధ్య జరుతున్న వార్‌తోనే స్టార్ట్ అయిన బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ నుంచి రకరకాల కాంట్రో స్టేట్మెంట్ వచ్చేలా చేస్తోంది. ఇప్పటికే విన్నర్‌గా అనౌన్స్ చేసిన సుబ్బు, గౌతమ్‌లు టాస్క్‌ ఫినిష్ అయిన తర్వాత.. అసలు గంటే కొట్టలేదంటూ.. మొదలైన డిస్కషన్.. హౌస్‌ను ఊసేస్తుంది. ఆ హీట్ మూమెంట్ శివాజీ ప్రిన్స్ మధ్య మనస్పర్థలకు కారణం అవుతుంది. యూ డోంట్ లైక్ ప్రశాంత్ అందుకే మా ఇద్దర్నీ ఫోర్త్‌ ప్లేస్‌లో పెట్టావని శివాజీ నోరు జారేలా చేస్తోంది. అంతే కాదు.. ఈ రగడ అర్థరాత్రి వరకు సాగుతుంది.

31వ రోజు ఉదయం తొమ్మిది గంటలకు.. ఊరమాసు సాంగ్‌తో కంటెస్టెంట్స్ ను నిద్ర లేపిన బిగ్ బాస్‌.. సరిగ్గా పదకొండలకు మరో నోట్‌తో … కంటెస్టెంట్స్‌ అందర్నీ గార్డెన్‌లో అసెంబుల్ చేస్తాడు. ఇప్పటి వరకు కన్ఫర్డ్మ్‌ కంటెస్టెంట్స్‌ పేరుతో గార్డెన్‌ గోడపై ఉన్న మారుతీ సుజీకి కీని వెంటనే బిగ్ బాస్‌కు తిరిగి ఇచ్చేయాలని ఆదేశిస్తాడు.

ఇక సరిగ్గా మద్యాహ్నం ఒంటి గంటకు బాగా తిని ముచ్చట పెట్టుకుంటున్న కంటెస్టెంట్స్‌ ముందుకు ఓ కొత్త టాస్క్ వదులుతాడు బిగ్‌ బాస్. తన ఫ్రెండ్ తన దగ్గర కొద్ది రోజుల నుంచి వస్తువులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని.. ఆ వస్తువులను మీ ద్వారా తీసుకోవాలని అనుకుంటున్నట్టు చెబుతాడు. యాక్టివిటీ రూంలో గాఢంగా నిద్రపోతున్న తన ఫ్రెండ్ దగ్గర నుంచి.. తాను చెప్పే హింట్‌కు అనుగుణంగా.. తన వస్తువులను దొంగిలించాలని చెబుతాడు. హింట్ ప్రకారం ఎవరు సరైన వస్తువు దొంగిలిస్తారో.. వారికే ఎక్కువ పాయింట్స్ అంటూ.. అనౌన్స్ చేస్తాడు. ఇక ఈ టాస్క్‌ పేరు దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర అంటూ.. చెబుతాడు బిగ్ బాస్.

ఇవి కూడా చదవండి

అయితే అలా బిగ్ బాస్ అనౌన్స్ చేశారో లేదో.. అప్పుడే అమర్, సందీప్ ప్లాన్‌ చేసుకోవడం షురూ చేస్తారు. వాళ్లను ఫాలో అవుతూ.. రిమైనింగ్ కంటెస్టెంట్స్ కూడా అదే చేస్తారు. పోటీ పడి దొంగలుగా రెడీ కూడా అవుతుంటారు. అంతలోనే టాస్క్‌ మొదలవడంతో.. ప్రియాంక, అమర్, ప్రశాంత్, తేజ, గౌతమ్‌ ముందుగా యాక్టివిటీ రూంలోకి వెళతారు. అయితే అత్యుత్సాహంతో లోపలికి వెళ్లిన కంటెస్టెంట్స్ మొదట యాక్టవిటీ రూంలో ఉన్న వస్తువులన్నీ దోచేస్తారు. దీంతో బిగ్ బాస్ వాళ్లందర్నీ వార్న్‌ చేస్తాడు. చెప్పిన వస్తువులు మాత్రమే తీస్తే సరిపోతుందంటూ.. గట్టిగా చెబుతాడు. దీంతో బిగ్ బాస్ చెప్పినట్టే వస్తువులు వసూలు చేసిన మొదటి బ్యాచ్ కంటెస్టెంట్స్.. బయటికి రాగానే ముష్టి యుద్ధం చేస్తారు. ఒకరు దొంగిలించిన వస్తువులను మరొకరు లాక్కునే ప్రయత్నం చేస్తూ.. కొట్టుకుంటూ ఉంటారు. దీంతో శివాజీ మరో సారి అగ్గిమీద గుగ్గిలం అవుతాడు.

సాయంత్రం 5 గంటలకు బడ్డీస్‌లోని మరొకరు అంటే.. ఫస్ట్ వెళ్లిన వాళ్లు కాక.. మిగిలిన వాళ్లు యాక్టివిటీ రూమ్‌కు వెళతారు. వీళ్లు బిగ్ బాస్ చెప్పిన వస్తువులను కాజేస్తుంటే.. బయట ఉన్న కంటెస్టెంట్స్ హాలులో ఉన్న టీవీల్లో చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. వాళ్ల రియాక్షన్‌ను .. యాక్షన్‌ను చూసి నవ్వుకుంటూ ఉంటారు.

ఇక ఆ తరువాత కౌంటింగ్‌కు రెడీ అయిన సీన్ కాస్త ఉదృతంగా మారుతుంది. తేజ దగ్గర నుంచి శోభ మొబైల్ ఫోన్ కొట్టేయండో…ప్రిన్స్ అండ్ శోభ మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ప్రిన్స్ అమ్మాయాని కూడా చూడకుండా.. శోభపై బలప్రయోగం చేయడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది. శోభ ప్రిన్స్ టీం నుంచి దొగలించడం.. దొంగిలించిన వస్తువును ఇవ్వను అంటూ.. బుకాయించడం ఆమెపై నెగెటివ్ ఫీలింగ్ బీబీ అడియెన్స్‌లో కలిగేలా చేస్తుంది. అయితే ఈ పోరులో.. ఎట్టకేలకు ప్రిన్స్ శోభ దగ్గర నంచి తన మొబైల్ ఫోన్‌ అయితే లాక్కుంటాడు.

ఇక ఆ తరువాత సీన్‌లోకి వచ్చిన బిగ్ బాస్.. బిగ్ బాస్ చెప్పిన వస్తువులు కాకుండా.. వేరే వస్తువులు తెచ్చిన కొటెస్టెంట్స్ ఆట స్వరూపాన్ని మార్చేస్తారంటూ కంటెస్టెంట్స్ పై సీరియస్ అవుతాడు. బిగ్‌ బాస్ చెప్పిన వస్తువులు కాకుండా.. వేరే వస్తువులు తక్కువ తెచ్చిన వాళ్లే విజేతలంటూ.. గేమ్ ను ఉల్టా చేస్తాడు. శివాజీని ప్రశాంత్‌ను విన్నర్‌గా అనౌన్స్ చేస్తాడు. అందుకు తగ్గట్టే వాళ్ల వాళ్ల స్టార్లను పెంచేస్తాడు బిగ్‌ బాస్.

ఇక ఆ తరువాత బత్తాయి జూస్‌ గేమ్ పెట్టిన బిగ్ బాస్.. ఓ బడ్డీ ఎదురుగా కొద్ది దూరంలో ఉన్న బకెట్‌లో బత్తాయిని త్రో చేయాలని.. మరో బడ్డీ.. తమ బకెట్‌లో పడ్డ బత్తానికి పిండి జూస్‌ చేయాలని చెబుతాడు. ఎవరు ఎక్కువగా జూస్‌ పిండుతారో వాళ్లే ఎక్కువ స్టార్స్‌ గెలుస్తారని.. చెబుతాడు. ఇక ఈ టాస్క్లో అమర్ , శివాజీ మొదటి ప్లేస్‌లో నిలుస్తారు.

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్‌బాస్‌-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి