Bommarillu Movie: మరోసారి థియేటర్లలోకి సిద్ధార్థ్ సూపర్ హిట్ మూవీ.. ‘బొమ్మరిల్లు’ రీరిలీజ్ ఎప్పుడంటే..
తెలుగు అడియన్స్ హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన చిత్రాల్లో బొమ్మరిల్లు ఒకటి. భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. సిద్ధార్థ్, జెనలీయా జంటగా నటించిన ఈ సినిమా 2006లో థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా థియేటర్లలో హీరోల పాత హిట్ చిత్రాలు విడుదలవుతున్నాయి. అంతేకాదు.. ఊహించని రెస్పాన్స్ తోపాటు భారీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇక ఈ రీరిలీజ్ ట్రెండ్ కమర్షియల్ గా వర్కవుట్ కావడంతో మరోసారి పాత సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోస్ సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే సిద్ధార్థ్ నటించిన ఓయ్, ధనుష్ త్రీ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. తాజాగా మరోసారి సిద్ధార్థ్ సూపర్ హిట్ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. అదే బొమ్మరిల్లు. ఈ చిత్రాన్ని 4కే వెర్షన్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
తెలుగు అడియన్స్ హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన చిత్రాల్లో బొమ్మరిల్లు ఒకటి. భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. సిద్ధార్థ్, జెనలీయా జంటగా నటించిన ఈ సినిమా 2006లో థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతేకాకుండా సిద్ధార్థ్, జెనిలీయా కెరీర్ లను మలుపు తిప్పిన సినిమా ఇదే. ఈ మూవీలో వీరిద్దరి యాక్టింగ్, డైలాగ్స్ అప్పట్లో యూత్ ను కట్టిపడేశాయి. హసిని క్యారెక్టర్ ప్రతి ఒక్క అమ్మాయికి కనెక్ట్ అయ్యింది. కేవలం ఆరు కోట్ల బడ్జె్ట్ తో రూపొందించిన ఈ సినిమా 36 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఏడు నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
అలాగే ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఈ మూవీలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీరామ్, కోట శ్రీనివాస్ రావు, తనికెళ్ల భరణి, సునీల్ కీలకపాత్రలు పోషించారు. తండ్రీ కొడుకుల బాండింగ్ కు లవ్ స్టోరీని జోడిస్తూ డైరెక్టర్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని 4కే వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 21న ఈ సినిమాను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ఇదివరకే మేకర్స్ ప్రకటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.