Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaakuntalam Twitter Review: ‘శాకుంతలం’ ట్విట్టర్ రివ్యూ.. శకుంతల, దుష్యంతుల ప్రేమకథా ఎలా ఉందంటే..

ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, గౌతమి, మధుబాల, అనన్య నాగళ్ల కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా ఈరోజు (ఏప్రిల్ 14న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక యూఎస్‏లో ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. శకుంతల.. దుష్యంతుల ప్రేమకథా ఎలా ఉందంటే..

Shaakuntalam Twitter Review: 'శాకుంతలం' ట్విట్టర్ రివ్యూ.. శకుంతల, దుష్యంతుల ప్రేమకథా ఎలా ఉందంటే..
Shaakuntalam
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 14, 2023 | 6:39 AM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో శకుంతలగా సామ్.. దుష్యంతుడిగా మలయాళీ యువ హీరో దేవ్ మోహన్ నటించగా.. భరతుడి పాత్రలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ బాలనటిగా వెండితెరకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. గత నెల రోజులుగా వరుసగా ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ అంటూ ప్రేక్షకులలో ఆసక్తిని క్రియేట్ చేశారు శాకుంతలం చిత్రబృందం. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించగా.. డైరెక్టర్ గుణశేఖర్ డాటర్ నీలిమ గుణ నిర్మించారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, గౌతమి, మధుబాల, అనన్య నాగళ్ల కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా ఈరోజు (ఏప్రిల్ 14న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక యూఎస్‏లో ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. శకుంతల.. దుష్యంతుల ప్రేమకథా ఎలా ఉందంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.