AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kriti Sanon: సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోన్నఆదిపురుష్ భామ..

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన దోచేయ్ సినిమాలో నటించింది ఈ చిన్నది ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

Kriti Sanon: సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోన్నఆదిపురుష్ భామ..
Kriti Sanon
Rajeev Rayala
|

Updated on: Apr 14, 2023 | 6:15 AM

Share

కృతి సనన్ .. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే . సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగులో అలరించనుంది ఈ చిన్నది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన దోచేయ్ సినిమాలో నటించింది ఈ చిన్నది ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది ఈ చిన్నది. అక్కడ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. ఏ రెండు సినిమాల తరువాత తిరిగి టాలీవుడ్ లో సినిమా చేయలేదు ఈ చిన్నది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది.

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ఆదిపురుష్. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. ఇటీవలే శ్రీరామ నవమి కానుకగా ఈ సినిమానుంచి సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు.

సోషల్ మీడియాలోనూ ఈ కృతి సనన్ చాల యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు రకరకాల ఫోటోలు పోస్ట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. లాంగ్ స్లైడ్ స్లిట్ డ్రెస్సులో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫోటోల పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ హాట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)