AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. సౌందర్యతో సూపర్ హిట్ మూవీ.. 19 ఏళ్లకు రీఎంట్రీ.. ఈ హీరోను గుర్తుపట్టారా.. ?

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోగా నటించడమే కాకుండా.. సహాయ పాత్రలలోనూ కనిపించాడు. అలాగే విలన్ పాత్రలలోనూ రఫ్పాడించారు. ఇక ఇప్పుడు దాదాపు 19 ఏళ్లకు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.

Tollywood: అప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. సౌందర్యతో సూపర్ హిట్ మూవీ.. 19 ఏళ్లకు రీఎంట్రీ.. ఈ హీరోను గుర్తుపట్టారా.. ?
Suresh
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2025 | 8:30 PM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా మంచి ఫాంలో ఉన్నప్పుడే అటు సహాయ పాత్రలలో.. ఇటు విలన్ పాత్రలలో కనిపించి అల్లాడించేశాడు. ఇక ఇప్పుడు దాదాపు 19 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు దివంగత హీరోయిన్ సౌందర్యతో కలిసి సూపర్ హిట్ మూవీ చేశాడు. అతడు మరెవరో కాదు.. సీనియర్ నటుడు సురేష్.

అయితే సురేష్ నటించనున్నది తెలుగు సినిమా కాదు… తమిళ్ సినిమా. 2006లో వచ్చిన నేషనల్ బర్డ్ చిత్రంలో చివరిసారిగా ప్రధాన పాత్ర పోషించిన సురేష్.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. 80ల నాటి స్టార్ మోహన్‌ను హరా సినిమాతో హీరోగా తిరిగి పరిచయం చేసిన దర్శకుడు విజయ్ శ్రీజి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం గమనార్హం . గత కొన్ని సంవత్సరాలుగా, సురేష్ తమిళం, తెలుగు చిత్రాలలో ఎక్కువగా సహాయక , ప్రతికూల పాత్రలలో నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

సురేష్ చివరిసారిగా కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం రివైండ్‌లో కనిపించాడు. మార్చి 7, 2025న విడుదలైన ఈ చిత్రానికి అభిమానుల నుండి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రాన్ని మలేషియాకు చెందిన నిర్మాణ సంస్థ జివి ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా భారతదేశం, మలేషియా అంతటా షూటింగ్ జరగనుందట. ఈ సినిమా టైటిల్, టీజర్‌ను ఏప్రిల్ 19, 2025న మలేషియాలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..