Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7/G Brundavan Colony: అమ్మ బాబోయ్‌.. 7/జీ బృందావన్‌ కాలనీ హీరో ఇలా మారిపోయాడేంటి! వైరల్ ఫొటోస్

శ్రీ సూర్యా మూవీస్‌ బ్యానర్‌పై ఏఎమ్‌ రత్నమ్‌ నిర్మించిన ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూర్చారు.తమిళంలో /G రెయిన్‌బో కాలనీగా విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో 7/G బృందావన్ కాలనీగా రిలీజై సెన్సేషన్‌ విజయాన్ని అందుకుంది. హీరో, హీరోయిన్ల నటన, సుమన్‌ శెట్టి, యువన్‌ శంకర్‌ రాజా బాణీలు..ఇలా బృందావన కాలనీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక తొలిసినిమాతోనే ఉత్తమ డెబ్యూ హీరోగా ఫిలింఫేర్‌ అందుకున్నాడు రవికృష్ణ.

7/G Brundavan Colony: అమ్మ బాబోయ్‌.. 7/జీ బృందావన్‌ కాలనీ హీరో ఇలా మారిపోయాడేంటి! వైరల్ ఫొటోస్
Hero Ravi Krishna
Follow us
Basha Shek

|

Updated on: Sep 17, 2023 | 3:21 PM

7/G బృందావన్ కాలనీ.. సుమారు 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ అప్పట్లో యూత్‌ను తెగ ఆకట్టుకుంది. ఇందులో నిర్మాత ఏఎం రత్నం తనయుడు రవికృష్ణ హీరోయిన్‌గా నటించాడు. సోనియా అగర్వాల్‌ కథానాయిక. సుమన్‌ శెట్టి, చంద్రమోహన్‌, సుదీపా పింకీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ సూర్యా మూవీస్‌ బ్యానర్‌పై ఏఎమ్‌ రత్నమ్‌ నిర్మించిన ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూర్చారు.తమిళంలో /G రెయిన్‌బో కాలనీగా విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో 7/G బృందావన్ కాలనీగా రిలీజై సెన్సేషన్‌ విజయాన్ని అందుకుంది. హీరో, హీరోయిన్ల నటన, సుమన్‌ శెట్టి, యువన్‌ శంకర్‌ రాజా బాణీలు..ఇలా బృందావన కాలనీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక తొలిసినిమాతోనే ఉత్తమ డెబ్యూ హీరోగా ఫిలింఫేర్‌ అందుకున్నాడు రవికృష్ణ. ఇదే సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్‌ సోనియా అగర్వాల్‌. డైరెక్టర్‌ సెల్వ రాఘవన్‌ క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. ఇలా ప్రేక్షకులను మెప్పించి ఎందరికో మైల్‌స్టోన్‌గా నిలిచిన 7/G బృందావన్ కాలనీ మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్‌ కానుంది. సెప్టెంబర్‌ 22న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది. తాజాగా 7/G బృందావన్ కాలనీ 4K వెర్షన్ రీ రిలీజ్‌ ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో, హీరోయిన్లు రవికృష్ణ, సోనియాతో పాటు కమెడియన్‌ సుమన్‌ శెట్టి, నిర్మాత ఏఎమ్‌ రత్నం తదితరులు పాల్గొన్నారు. బృందావన్‌ కాలనీ సినిమా అనుభవాలను మళ్లీ గుర్తుచేసుకున్నారు. అయితే బృందావన కాలనీతో ఎంతో బక్కగా కనిపించిన హీరో రవికృష్ణ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. బరువు పెరిగిన అతనిని చూసి చాలామంది మొదట గుర్తుపట్టలేకపోయారు.

ప్రస్తుతం హీరో రవికృష్ణ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా 7/G బృందావన్ కాలనీ తర్వాత ముద్దుల కొడుకు, కేడీ, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, నిన్న నేడు రేపు తదితర సినిమాల్లో హీరోగా నటించాడు రవికృష్ణ. అయితే సక్సెస్‌ కంటిన్యూ చేయలేకపోయాడు. అతను సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించి సుమారు 12 ఏళ్లు అవుతోంది. అయితే త్వరలోనే 7/G బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కనుంది. ఇందులో రవికృష్ణ, సోనియా కూడా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

హీరో రవికృష్ణ లేటెస్ట్ ఫొటోస్

View this post on Instagram

A post shared by Film Combat (@thefilmcombat)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.