AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara: రిలీజ్ కు ముందే నాని సినిమాకు క్రేజ్.. భారీ ధరకు ‘దసరా’ మూవీ శాటిలైట్ రైట్స్

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాని ఫుల్ జోష్ లో నెక్స్ట్ సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు.

Dasara: రిలీజ్ కు ముందే నాని సినిమాకు క్రేజ్.. భారీ ధరకు 'దసరా' మూవీ శాటిలైట్ రైట్స్
Nani
Rajeev Rayala
|

Updated on: Jul 13, 2022 | 6:50 AM

Share

నేచురల్ స్టార్ నాని(Nani)ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాని ఫుల్ జోష్ లో నెక్స్ట్ సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. శ్యామ్ సింగరాయ్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన నాని రీసెంట్ గా అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో నజ్రియా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత నాని దసరా(Dasara) అనే సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మునుపెన్నడూ కనిపించనంత మాస్ క్యారెక్టర్ లో నాని కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లిమ్ప్స్ సినిమా పై ఆసక్తికి క్రియేట్ చేశాయి.

రా హెయిర్ స్టయిల్, గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్‌ లో కనిపించనున్నారు. నాని ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం విశేషం. నాని మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న దసరా భారీ స్థాయిలో రూపొందుతోంది. ఈ సినిమాకు డిజిటల్ హిందీ శాటిలైట్ ఆడియో రైట్స్ అన్నీ కలిపి 47 కోట్ల మేరకు రికార్డు స్తాయి మొత్తంలో ఆఫర్లు దక్కినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో మొత్తం ప్రధాన తారాగణం షూట్‌ లో పాల్గొంటున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ లో భారీ సెట్‌ వేశారు. ఈ సెట్ లో దాదాపు 500 వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లమధ్య నాని , కీర్తిసురేష్ పై ఓ పాటను చిత్రీకరిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమానుంచి కీలక అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్