Krithi Shetty: ఆ స్టార్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన కృతి శెట్టి..

వచ్చే నెలలో చైతన్యతో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. తనతో కలిసి మరోసారి పనిచేసేందుకు సంతోషంగా ఉంది.

Krithi Shetty: ఆ స్టార్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన కృతి శెట్టి..
Krithi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 12, 2022 | 6:03 PM

బంగార్రాజు సినిమాలో అక్కినేని నాగచైతన్యతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంది ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty). ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి చైతూతో జత కట్టనుంది కృతి శెట్టి. డైరెక్టర్ వెంకట్ ప్రభు.. చైతూ కాంబోలో రాబోతున్న సినిమాలో బేబమ్మ కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ది వారియర్ సినిమా ప్రమోషన్లలో ఉన్న బేబమ్మయ.. ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగచైతన్య గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

కృతి శెట్టి మాట్లాడుతూ.. “వచ్చే నెలలో చైతన్యతో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. తనతో కలిసి మరోసారి పనిచేసేందుకు సంతోషంగా ఉంది. నాగ చైతన్యతో కలిసి పనిచేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ప్రేక్షకులు మరోసారి మా పెయిర్ చూసేందుకు ఇష్టపడతారని అనుకుంటున్నాను. మరో మంచి చిత్రాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తున్నామని భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

చిత్రపరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ప్రశాంతతను కోల్పోవల్సి వస్తుందని చాలా మంది తనతో చెప్పారని.. కానీ చైతన్య చూసిన తర్వాత.. అతను చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఎంతో ప్రశాంతంగా.. నిజాయితీగా.. స్వచ్చమైన మనసు ఉన్నవారని.. చైతన్యలో ఉండే ఈ లక్షణాలు తనకు స్పూర్తినిస్తాయని తెలిపింది. తనతో కలిసి పనిచేసినప్పుడు రిఫ్రెష్ గా ఉంటుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.