AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthikeya 2: కార్తీకేయ 2 రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన హీరో.. ఆ విషయానికి క్షమపణలు కోరుతూ ట్వీట్..

ఈ సినిమాను ద్వారకా నగరంపై జరిగే అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాను జూలై 22న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్ర

Karthikeya 2: కార్తీకేయ 2 రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన హీరో..  ఆ విషయానికి క్షమపణలు కోరుతూ ట్వీట్..
Karthikeya 2
Rajitha Chanti
|

Updated on: Jul 12, 2022 | 11:17 AM

Share

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కార్తీకేయ 2. గతంలో వచ్చిన కార్తికేయ చిత్రానికి సిక్వెల్ గా ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ చందు మొండేటి. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను ద్వారకా నగరంపై జరిగే అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాను జూలై 22న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రమోషన్స్‌ కూడా మొదలు పెట్టేశారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా కార్తికేయ 2 సినిమా విడుదల పై క్లారిటీ ఇచ్చాడు హీరో నిఖిల్. కార్తీకేయ 2 సినిమా టికెట్స్ 25 నిమిషాలలో సేల్ అయ్యాయని.. టికెట్స్ ఓపెన్ అయ్యాయంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. నిఖిల్ స్పందించాడు. సారీ.. సినిమా జూలై 22న విడుదల కావడం లేదు. ఆగస్ట్ మొదటివారంలో ప్రీమియర్ షో కోసం టికెట్స్ బుక్ చేసిన వారికి అమేజింగ్ పీపీఎల్ కి క్షమాపణలు చెబుతున్నాను.. మీ అమౌంట్ రిఫండ్ వస్తుంది అంటూ రిప్లై ఇచ్చాడు నిఖిల్. మొత్తానికి కార్తికేయ 2 విడుదల వాయిదా పడిందంటూ హీరో క్లారిటీ ఇచ్చేశాడు.

ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ కీలకపాత్రలలో నటిస్తుండగా.. కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..