KrishnaVamshi: నన్ను ఎన్టీఆర్ ఎప్పుడు కలిసినా అదే విషయం అడుగుతారు.. డైరెక్టర్ కృష్ణవంశీ కామెంట్స్ వైరల్..

ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న లేటేస్ట్ చిత్రం రంగ మార్తాండ. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

KrishnaVamshi: నన్ను ఎన్టీఆర్ ఎప్పుడు కలిసినా అదే విషయం అడుగుతారు.. డైరెక్టర్ కృష్ణవంశీ కామెంట్స్ వైరల్..
Krishnavamsi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 12, 2022 | 12:12 PM

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్‏లలో కృష్ణవంశీ (Krishnavamsi) ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. గులాబి, నిన్నే పెళ్లాడుతా, చంద్రలేఖ, అంతఃపురం, మురారి, ఖడ్గం, శ్రీఆంజనేయం వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ఆయన రూపొందించినవే. అయితే కొద్ది కాలంగా కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న లేటేస్ట్ చిత్రం రంగ మార్తాండ. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మరింత క్యూరియాసిటీని పెంచాయి.

ఈసినిమా ప్రమోషన్లలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న కృష్ణవంశీ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు తాను తెరకెక్కించిన సినిమాలన్నింటిలోనూ రంగమార్తాండ ఎంతో ప్రత్యేకమన్నారు. మనసుపెట్టి తీసిన ఈ ఎమోషనల్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. ఇప్పటివరకు తనతో కలిసి పనిచేసిన హీరోలు ఎప్పుడు ఎదురుపడిన ఎంతో చక్కగా మాట్లాడతారని తెలిపారు. అలాగే.. ఇప్పటికీ ఎప్పుడూ ఎన్టీఆర్ ను కలిసిన.. ఒకే విషయం అడుగుతారన్నారు. మంచి కథ ఉంటే చెప్పండి చేద్దాం అంటూ అడుగుతారని అన్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన రాఖీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇలియానా, ఛార్మీ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.