Ram Pothineni : పెళ్లి గురించి అడిగిన సుమకు … దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన హీరో రామ్
రామ్ ఇంటర్ వరకే చదువుకున్నారా? సుమ రామ్ ను అడగగా.. అందుకు రామ్ 12Th తరువాత చౌదరి గారు సినిమాల్లోకి తీసుకొచ్చారని సమాధానం చెప్పారు.
పుట్టిన ప్రతీ ఓడు.. పెరగడం.. పెరిగిన ప్రతోడు చదవడం.. చదివిన ప్రతోడు బ్రతకడానికి ఏదోటి చేయడం.. అలా చేస్తున్న ప్రతోడు.. ఎప్పుడో ఒకప్పుడుపెళ్లి చేసుకోవడం.. ఆపై పిల్లల్ని కనడం…! ఇది క్వైట్ రొటీన్ కమ్ కామన్ థింగ్. అయితే కామన్ మ్యాన్స్ పెళ్లి గురించి పక్కుకు పెడితే.. ఓ సెలబ్రిటీ పెళ్లి గురించి తెలుసుకోవడం.. పెళ్లెప్పుడంటూ..? ఆరా తీయడం.. ఆ స్టార్‌ను ప్రశ్నించడం.. మనకు ఓ ఎంటర్‌టైన్మెంట్ థింగ్. అయితే ఇదే ప్రశ్నను ఫ్యాన్స్ తరపున హీరో రామ్ (Ram Pothineni) ను అడిగారు సుమ (Anchor Suma). ఆ ఒక్క ప్రశ్నతో.. రామ్ చెప్పిన క్రేజీ ఆన్సర్ తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
రామ్ పోతినేని, కృతి షెట్టి (Krithi Shetty) హీరోహీరోయిన్లుగా లింగుస్వామి (Lingusamy) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ ‘ది వారియర్'(The Warriorr). హైఎనర్జిటిక్ యాక్షన్ ఫిల్మ్ గా.. జూలై 14న వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 10న హైదరాబాద్‌లో జరిగింది. ఇక అన్ని ఈవెంట్స్ కు మళ్లే ఈ ఈవెంట్‌కు కూడా హోస్ట్ చేసిన సుమ.. తనదైన మాటలతో , పంచులతో షోలో హంగామా చేశారు. నెటిజెన్స్ హీరో రామ్‌ను అడగాలనుకునే ప్రశ్నలను తనే అడిగారు. మనోడితో క్రేజీ ఆన్సర్స్ రాబట్టారు.
ఇక రామ్ ఇంటర్ వరకే చదువుకున్నారా? సుమ రామ్ ను అడగగా.. అందుకు రామ్ 12Th తరువాత చౌదరి గారు సినిమాల్లోకి తీసుకొచ్చారని సమాధానం చెప్పారు. తనకు కూడా అదే అనిపించింది అంటూ క్లియర్గా చెప్పారు రామ్. ఇక మీ పెళ్లి ఎప్పుడంటూ.? సుమ అడగగా… “కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానాలుండవు” అంటూ క్రేజీగా చెప్పి ఆడిటోరియంలో ఉన్న అందర్నీ అరిపించారు రామ్. ఇప్పుడీ ఆన్సర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.