Rakul Preet Singh: రకుల్ తెలుగు సినిమాలు ఎందుకు చేయట్లేదు ?.. అసలు విషయం చెప్పేసిన హీరోయిన్..

తెలుగులో చివరిసారిగా డైరెక్టర్ క్రిష్, మెగా హీరో వైష్ణవ్ తేజ్ కాంబోలో వచ్చిన కొండపొలం సినిమాలో కనిపించింది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా నటించి మెప్పించింది.

Rakul Preet Singh: రకుల్ తెలుగు సినిమాలు ఎందుకు చేయట్లేదు ?.. అసలు విషయం చెప్పేసిన హీరోయిన్..
Rakul
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 12, 2022 | 12:36 PM

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. చేతి నిండా సినిమాలతో బీటౌన్ లో సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో చివరిసారిగా డైరెక్టర్ క్రిష్, మెగా హీరో వైష్ణవ్ తేజ్ కాంబోలో వచ్చిన కొండపొలం సినిమాలో కనిపించింది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా నటించి మెప్పించింది. ఈ మూవీ తర్వాత రకుల్ నుంచి మరే తెలుగు సినిమా అప్డేట్ రాలేదు. దీంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు ఎందుకు చేయ్యట్లేదు అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇటీవల తన ఇన్ స్టాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే ఫాలోవర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అయితే ఓ అభిమాని రకుల్ ను మీరు తెలుగు సినిమా చేస్తారా ? లేదా హిందీ సినిమాల్లో మాత్రమే ఉండిపోవాలనుకుంటున్నారా ? అంటూ ఏడుస్తున్న ఎమోజీని షేర్ చేసాడు.

Rakul

Rakul

దీంతో రకుల్ స్పందిస్తూ.. “నేను తెలుగు సినిమాలు చేస్తాను. ప్రస్తుతం నేను విభిన్నంగా సరికొత్తగా చేసేందుకు ఎదురుచూస్తున్నారు. ఛాలెంజింగ్ పాత్రలు రావాలనుకుంటున్నాను. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాను. స్క్రిప్ట్ వస్తే తప్పకుండా చేస్తాను” అంటూ హార్ట్ సింబల్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె థాంక్ గాడ్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్ర ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.