Uday Kiran: ఆ సినిమాను ఉదయ్‌ కిరణ్ చేస్తే మరోలా ఉండేదేమో.. మురళీ మోహన్ కామెంట్స్..

అప్పటికే హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో ఉన్న మురళీ మోహన్ సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చి రియలెస్టేట్ బిజినెస్‌ తో బిజీ అయిపోయారు. ఆ తరువాత వన్‌ ఫైన్ డే..

Uday Kiran: ఆ సినిమాను ఉదయ్‌ కిరణ్ చేస్తే మరోలా ఉండేదేమో.. మురళీ మోహన్ కామెంట్స్..
Uday Kiran
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 12, 2022 | 12:53 PM

ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu) ఫిల్మ్ కెరీర్‌లో వన్‌ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ లిస్టులో ‘అతడు’ సినిమా కూడా ఒకటి. తన ఇంటెన్స్ యాక్టింగ్‌ తో.. సింపుల్ అండ్ స్ట్రెయిట్ డైలాగ్‌ డెలవరీతో అందర్నీ ఫిదా చేసిన మహేష్.. ఆ సినిమాతో మరింత మందిని తన ఫాలోవర్స్ గా మార్చుకున్నారు. అయితే మహేష్ కెరీర్‌కు ఇంతలా ప్లస్‌ అయిన ఈ సినిమా.. మహేష్ కంటే ముందు మరో హీరో చేయాల్సింది తెలుసా..? అప్పటికే లవర్‌ బాయ్ ఇమేజ్‌తో పీక్‌ స్టేజ్‌లో ఉన్న ఉదయ్‌ కిరణ్ కు ఈ సినిమా ఛాన్స్ వచ్చిందని తెలుసా? తెలియదు కదా.. అయితే ఉదయ్‌ కిరణ్ ఈ సినిమా ను ఎలా మిస్ చేసుకున్నారో తెలియాలంటే.. లెస్ట్ సీ దిస్ స్టోరీ!

అప్పటికే హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో ఉన్న మురళీ మోహన్ సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చి రియలెస్టేట్ బిజినెస్‌ తో బిజీ అయిపోయారు. ఆ తరువాత వన్‌ ఫైన్ డే.. జయబేరి ప్రొడక్షన్స్ అనే ఓ సంస్థను స్థాపించి సినిమాలు ప్రొడ్యూస్‌ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ క్రమంలోనే రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ చెప్పిన ‘అతడు’ స్టోరీని సినిమాగా ప్రొడ్యూస్ చేద్దామనుకున్నారు మురళి మోమన్. అయితే ఈ స్టోరీ … అప్పటికే తనకు బాగా పరిచయం ఉన్న యంగ్ హీరో ఉదయ్‌ కిరణ్ కు అయితే బాగా సెట్ అవుతుందని ఫీలైన ఈయన.. ఉదయ్‌ కి కాల్ చేసి సినిమా చేయాల్సిందిగా చెప్పారట.

అయితే అతడు స్క్రీప్ట్ విన్న ఉదయ్‌ కిరణ్… బాగా నచ్చినప్పటికీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో.. ఈ సినిమా చేయలేనని మురళి మోహన్ కు చెప్పేశారట. దాంతో మురళి మోహన్ చేసేదేంలేక మరో హీరో మహేష్ బాబుకు ఈ స్టోరీని వినిపించి ఓకే చెప్పించుకున్నారట. అలా ఈ సినిమా ఉదయ్‌ కిరణ్ చేతుల్లోంచి మహేష్ బాబు చేతుల్లోకి వెళ్లింది. ఇండస్ట్రీలో మహేష్ కు మంచి బ్రేక్ వచ్చేలా చేసింది.

అయితే తాజాగా మురళి మోహన్ ఓ ఇంటర్య్వూలో ఈ విషయాన్ని చెప్పడంతో.. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవ్వడమే కాదు.. ఉదయ్‌ కిరణ్ ఈ సినిమా చేసుంటే.. అతడి ఫిల్మ్ కెరీర్‌ మరోలా ఉండేదని.. ఇప్పటికీ మన మధ్యే ఉండేవారిన ఉదయ్ హార్డ్ కోర్‌ ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వచ్చేలా చేస్తోంది