AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiyaan Vikram: కోబ్రా ఆడియో లాంచ్‏లో హీరో విక్రమ్ సందడి.. ఆరోగ్యం పై వచ్చిన రూమర్స్ గురించి ఫన్నీ కామెంట్స్..

తాజాగా కోబ్రా ఆడియో లాంచ్‏లో సందడి చేశారు. వేదికపై విక్రమ్‏ను స్టైలీష్ లుక్ లో చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. సెమీ ఫార్మల్ డ్రెస్సింగ్ లో ఎంతో

Chiyaan Vikram: కోబ్రా ఆడియో లాంచ్‏లో హీరో విక్రమ్ సందడి.. ఆరోగ్యం పై వచ్చిన రూమర్స్ గురించి ఫన్నీ కామెంట్స్..
Vikram
Rajitha Chanti
|

Updated on: Jul 12, 2022 | 10:52 AM

Share

తమిళ్ స్టార్ విక్రమ్ చియాన్ (Chiyaan Vikram)  ఇటీవల అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఛాతీలో స్వల్ప అసౌకర్యంగా ఉండడంతో ఆసుపత్రిలో చేరారు. దీంతో విక్రమ్ గుండెపోటుకు గురయ్యారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. విక్రమ్ ఆరోగ్యంపై అభిమానులు కాస్త కంగారు పడడంతో కేవలం ఆయన అస్వస్థతకు మాత్రమే గురయ్యారని.. గుండెపోటు కాదని వైద్యులు అధికారికంగా దృవీకరిచడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా కోబ్రా ఆడియో లాంచ్‏లో సందడి చేశారు. వేదికపై విక్రమ్‏ను స్టైలీష్ లుక్ లో చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. సెమీ ఫార్మల్ డ్రెస్సింగ్ లో ఎంతో సంతోషంగా కనిపించాడు. అంతేకాకుండా.. వేదికపై ప్రసంగిస్తూ తన ఆరోగ్యం పట్ల వచ్చిన రూమర్స్ గురించి ఫన్నీ కామెంట్స్ చేశారు.

విక్రమ్ తన ఛాతీపై చేయి వేసి మాట్లాడుతూ.. ” ప్రస్తుతం నేను నాకు తెలియకుండానే నా ఛాతీపై చేయి పెట్టాను. ఇప్పుడు దానిని గుండెపోటు అంటారు అనుకుంటా” అంటూ నవ్వులు పూయించాడు. తన ఆరోగ్యం పట్ల వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని.. ప్రస్తుతం తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని అభిమానులతో చెప్పడానికే కోబ్రా ఆడియో లాంచ్‏కు వచ్చినట్లు చెప్పుకొచ్చాడు విక్రమ్.

విక్రమ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ కోబ్రా సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇందులో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి కథానాయికగా నటించగా.. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్‌గా కనిపించనున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!