Mahesh Babu: సోషల్ మీడియాలో సూపర్ స్టార్ జోష్.. బర్త్ డే కౌంట్‌డౌన్ షురూ..
Mahesh Babu: ఇటీవల మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను కలిసిన ఫోటోను మహేష్ బాబు ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఆయన ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోయారు. దాదాపు లక్ష లైకులతో తమ అభిమాన నటుడు స్టామినాను చాటారు.
Mahesh Babu: ఇంటర్నెట్‌లో మహేష్‌బాబు ఫ్యాన్ బేస్ గురించి స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన పనిలేదు. మిగిలిన హీరోలతో పోలిస్తే నెట్టింట స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా మహేష్ ఎప్పటికప్పుడూ ప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. అకేషన్ ఉన్నా, లేకున్నా ట్రెండింగ్‌లో నెంబర్ వన్ హీరోగా అదరగొట్టేస్తారు సూపర్‌స్టార్. ఓ వైపు నాన్‌స్టాప్‌గా వర్షాలు, మరోవైపు ఈ వీక్ రిలీజ్‌కి రెడీ అవుతున్న సినిమాలు.. నెటిజన్లకు అవేమీ పట్టడం లేదు. ఎందుకంటే ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నది మహేష్ మేనియా. మహేష్ బర్త్ డే కి కౌంట్‌డౌన్ బిగిన్స్ అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ బర్త్ డే ఆగస్టు 9వ తేదీన. అయితే నెల రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో ఆయన వీరాభిమానులు కౌంట్‌డౌన్ షురూ చేశారు.
ఇటీవల మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను కలిసిన ఫోటోను మహేష్ బాబు ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఆయన ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోయారు. దాదాపు లక్ష లైకులతో తమ అభిమాన నటుడు స్టామినాను చాటారు.
Had the pleasure of meeting Mr. @BillGates! One of the greatest visionaries this world has seen… and yet the most humble! Truly an inspiration!! pic.twitter.com/3FN2y7bIoc
— Mahesh Babu (@urstrulyMahesh) June 29, 2022
అటు మహేష్ – త్రివిక్రమ్ సినిమా కోసం వెయిటింగ్ అంటూ, రీసెంట్‌గా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయాన్ని కూడా భారీ స్థాయిలో ట్రెండ్ చేస్తున్నారు. దాంతో పాటు సింగిల్ లాంగ్వేజ్ సినిమాకు మహేష్ తీసుకుంటున్న పేమెంట్ గురించి కూడా సోషల్ మీడియా వేదికగా గట్టి చర్చే జరుగుతోంది.
నెక్స్ట్ సమ్మర్‌లో మహేష్ – రామ్‌చరణ్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడతారనే విషయం కూడా వైరల్ అవుతోంది. దాంతో పాటు సరిలేరు నీకెవ్వరు హిందీ వెర్షన్ సరిలేరు పేరుతో ఈ నెల 31న టెలివిజన్ ప్రీమియర్స్ కి రెడీ అవుతోంది. గోల్డ్ మైన్స్ సంస్థ అనౌన్స్ చేసిన ఈ పోస్టర్ కూడా గట్టిగానే తిరుగుతోంది నెట్టింట్లో.
మరిన్ని సినిమా వార్తలు చదవండి