Prabhas: అభిమానులకు మరింత దగ్గరవ్వనున్న ప్రభాస్.. ఎలాగంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చిన్న పిల్లాడినడిగిన చెప్తాడు. డార్లింగ్ రేంజ్ బాహుబలి సినిమా నుంచి దేశం దాటి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. ప్రభాస్ సినిమా వస్తుందంటే అన్ని భాషల్లో అభిమానులు ఆసక్తి నెలకొంటోంది.

Prabhas: అభిమానులకు మరింత దగ్గరవ్వనున్న ప్రభాస్.. ఎలాగంటే..
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 12, 2022 | 8:10 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) క్రేజ్ గురించి చిన్న పిల్లాడినడిగిన చెప్తాడు. డార్లింగ్ రేంజ్ బాహుబలి సినిమా నుంచి దేశం దాటి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. ప్రభాస్ సినిమా వస్తుందంటే అన్ని భాషల్లో అభిమానులు ఆసక్తి నెలకొంటోంది. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్ సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ సోషల్ మీడియాలో అంతగా ఏక్టివ్ గా ఉండడు.. మొన్నటి వరకు పేస్ బుక్ లో మాత్రమే కనిపించిన ప్రభాస్ ఇటీవల ఇన్‌స్టా‌గ్రామ్ లో అభిమానులను అలరిస్తున్నాడు. పేస్ బుక్, ఇన్ స్టా లో డార్లింగ్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా ప్రభాస్ తన అభిమానులకు మరింత చేరువ కానున్నాడని తెలుస్తోంది.

త్వరలోనే ప్రభాస్ ట్విట్టర్ లోకి అడుగు పెట్టనున్నడని ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా స్టార్ డమ్ నేపథ్యంలో ట్విట్టర్ ఎంట్రీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. త్వరలోనే ప్రభాస్ ట్విట్టర్ అకౌంట్ ను క్రియేట్ చేయనున్నారని.. అతి త్వరలోనే ప్రభాస్ మొదటి ట్వీట్ వచ్చే అవకాశం ఉందని సన్నిహితులు అంటున్నారు. ఇక ప్రభాస్ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం ఫాలోవర్స్ సంఖ్యతో రికార్డులు బద్దలు కావడం కఖాయం అంటున్నారు అభిమానులు. డార్లింగ్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్  అనే సినిమా చేస్తున్నాడు. అలాగే  బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రామాయణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆతర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే అనే సినిమా చేస్తున్నాడు. అదే విధంగా సందీప్ వంగ డైరెక్షన్లో స్పిరిట్, మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే సినిమాలు చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి