AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Film News: పాన్ ఇండియా కాదు.. ఇకపై అంతా హాలీవుడ్డే.. అక్కడ టార్గెట్ ఫిక్స్ చేసిన మన తారలు వీరే

హాలీవుడ్ యాక్టర్స్ ఎలాగైతే మన సినిమాల్లో కనిపిస్తున్నారో.. మన వాళ్లు కూడా అక్కడికి వెళ్లి సత్తా చూపిస్తున్నారు. ఇప్పటికే మనవాళ్లు అక్కడ కొందరు మెరవగా.. మరికొందరు డెబ్యూలకు రెడీ అవుతున్నారు.

Film News: పాన్ ఇండియా కాదు.. ఇకపై అంతా హాలీవుడ్డే.. అక్కడ టార్గెట్ ఫిక్స్ చేసిన మన తారలు వీరే
Samantha Alia Hrithik
Ram Naramaneni
|

Updated on: Jul 11, 2022 | 7:07 PM

Share

Hollywood debut: ఒకప్పుడు ప్రాంతీయ సినిమా కాస్తా.. ఇప్పుడు పాన్ ఇండియా అయింది. తాజాగా పాన్ ఇండియా(Pan India) కాస్తా పాన్ వరల్డ్ అవుతుంది. కేవలం సినిమాల విషయంలోనే కాదు.. యాక్టర్స్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ముఖ్యంగా మన ఇండియన్ స్టార్స్‌కు హాలీవుడ్‌(Hollywood)లోనూ క్రేజ్ పెరిగిపోతుంది. సమంతతో మొదలుపెట్టి చాలామందికి హాలీవుడ్ నుంచి పిలుపు అందుతుంది. మరి ఇక్కడ్నుంచి అక్కడికి వెళ్తున్న స్టార్స్ ఎవరు..? ఒకప్పుడు ఇండియన్ స్టార్స్ హాలీవుడ్‌లో నటిస్తే అదో అద్భుతం. అప్పట్లో దీపిక, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యా రాయ్(Aishwarya Rai ), ఇర్ఫాన్ ఖాన్ సహా కొందరు ఇంగ్లీష్ సినిమాలు చేసారు. అయితే ఇప్పుడది చాలా చిన్న విషయం అయిపోయింది. హాలీవుడ్ యాక్టర్స్ ఎలాగైతే మన సినిమాల్లో కనిపిస్తున్నారో.. మన వాళ్లు కూడా అక్కడికి వెళ్లి సత్తా చూపిస్తున్నారు. ఇప్పటికే ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్‌లో హీరోగా నటించిన ధనుష్.. అవేంజర్స్ డైరెక్టర్స్ రస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న ది గ్రే మ్యాన్‌లో కీలక పాత్ర చేస్తున్నారు.

కేవలం ధనుష్ మాత్రమే కాదు.. సమంత సైతం హాలీవుడ్‌కు వెళ్తున్నారు. బాలీవుడ్‌లో వరస సినిమాలకు కమిటవుతున్న స్యామ్‌కు హాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే సినిమాలో బైసెక్సువల్ తమిళ యువతిగా సమంత నటించనున్నట్లు తెలుస్తుంది. ఇక మేజర్‌తో క్రేజ్ తెచ్చుకున్న శోభితా ధూళిపాల.. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ తెరకెక్కిస్తున్న సినిమాతో హాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఈ సినిమా ఓటిటిలో విడుదల కానుంది. హృతిక్ రోషన్ హాలీవుడ్ ఎంట్రీ 2019లోనే కన్పర్మ్ అయింది. కాకపోతే కరోనా కారణంగా వాయిదా పడింది. హాలీవుడ్‌లో గెర్ష్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు హృతిక్. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మధ్యే గర్భవతి అయిన అలియా భట్.. హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమాతో ఇంగ్లీష్ వరల్డ్‌లోకి అడుగు పెట్టనున్నారు. ఇక మిస్ మార్వల్ సినిమాతో హాలీవుడ్‌కు వెళ్తున్నారు ఫర్హాన్ అక్తర్. మొత్తానికి రాబోయే ఏడాది రెండేళ్లలోనే వీళ్ళంతా హాలీవుడ్ స్టార్స్ అవ్వనున్నారన్నమాట.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.