Harish Shankar: రామ్‏తో సినిమా చేయాల్సింది.. కొన్ని కారణాలతో కుదరలేదు.. డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్ వైరల్..

నేను 'దేవదాస్' నుంచి రామ్ ఫ్యాన్. ఎన్నోసార్లు అతనితో సినిమా చేయాలని ట్రై చేశా. వేర్వేరు కారణాల వల్ల కుదరలేదు. బెస్ట్ పార్ట్ ఏంటంటే... కథ చెబుతున్నప్పుడు ప్రేక్షకుడిలా ఆలోచిస్తాడు.

Harish Shankar: రామ్‏తో సినిమా చేయాల్సింది.. కొన్ని కారణాలతో కుదరలేదు.. డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్ వైరల్..
The Warriorr
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 11, 2022 | 6:12 PM

యంగ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni).. కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ది వారియర్. మొదటిసారి ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో రామ్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించగా.. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. . ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న భారీ ఎత్తున సినిమా విడుదలఅవుతోంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వ‌హించారు. ఈ వేడుకలకు డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రామ్ తో తాను సినిమా చేయాల్సి ఉందని.. కానీ కొన్ని కారణాలతో చేయలేకపోయానంటూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు హరీష్ శంకర్.

దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ”లింగుస్వామి గారికి వెల్కమ్. మీ సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాం. ‘రన్’, ‘పందెం కోడి’, ‘ఆవారా’ సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్. థియేటర్లలో ఎన్నిసార్లో చూశానో నాకే తెలియదు. యాక్షన్ సీక్వెన్సును పేపర్ మీద రాసి, షూటింగ్ కంటే ముందు చూసే దర్శకుడు లింగుస్వామి. ఈ సినిమా పనుల్లో ఉండటం వల్ల దేవి శ్రీ ప్రసాద్ ఇక్కడికి రాలేకపోయారు. నిన్న దేవితో నేను మాట్లాడాను. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నానని చెప్పాడు. ఈ సినిమా గురించే మాట్లాడుకున్నాం. జూలై 14న మాస్ ఫెస్టివల్. లింగుస్వామి గారి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు.

మా హీరో రాపో (రామ్ పోతినేని). రాపోలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే… దర్శకులతో మంచి ర్యాపో మైంటైన్ చేస్తాడు. నేను ‘దేవదాస్’ నుంచి రామ్ ఫ్యాన్. ఎన్నోసార్లు అతనితో సినిమా చేయాలని ట్రై చేశా. వేర్వేరు కారణాల వల్ల కుదరలేదు. బెస్ట్ పార్ట్ ఏంటంటే… కథ చెబుతున్నప్పుడు ప్రేక్షకుడిలా ఆలోచిస్తాడు. ఒకసారి నేను సెన్సిటివ్ లవ్ స్టోరీ చెప్పాను. అందులో ఇద్దరు హీరోలు ఉంటారు. అది రామ్ చేసే సినిమా కాదు. నేను కూడా వేరే తరహా సినిమా చేద్దామనుకున్నా. అప్పుడు ఫ్యాన్ రెండులోనో, మూడులోనో తిరుగుతోంది. రామ్ ఒక డైలాగ్ చెప్పాడు… ‘బ్రో, మనం సినిమా చేస్తే ఫ్యాన్ ఐదులో తిరగాలి’ అన్నాడు. అది నాకు బాగా నచ్చింది. కచ్చితంగా రామ్ తో సినిమా ఉంటుంది. అది ఎప్పుడనేది ఈ రోజు చెప్పలేను.

రామ్ తో నేను సినిమా చేస్తున్నా. అతి త్వరలో సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను. రామ్ ఎనర్జీని మ్యాచ్ చేయడం దర్శకులకు పెద్ద టాస్క్. దర్శకుడు మంచి క్యారెక్టర్ రాసినప్పుడు, పెర్ఫార్మన్స్ చేయడం అనేది యాక్టర్లకు ఛాలెంజ్. రామ్ తో పని చేయడం దర్శకులకు ఛాలెంజ్. ‘ది వారియర్’ ట్రైలర్ చూశా. చాలా బావుంది. పోలీస్ రోల్ అలా ఉంటుందని ఊహించలేదు. డైలాగ్స్ వింటే గూస్ బంప్స్ వచ్చాయి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. జూలై 14న ప్రేక్షకులతో పాటు నేను కూడా థియేటర్లలో సినిమా చూస్తా” అని అన్నారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!