Dhanush: ధనుష్ కోసం ఇండియాకు వస్తున్న హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్.. ఎప్పుడు.. ఎందుకంటే..
'ది గ్రే మ్యాన్' ప్రదర్శనకు, మా స్నేహితుడు ధనుష్ ను చూసేందుకు ఇండియాకు వస్తుండటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో కలుద్దాం
తమిళ్ స్టార్ హీరో ధనుష్ కోసం ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్స్ రస్సో బ్రదర్స్ భారత్‌కు వస్తున్నారు. కెప్టెన్ అమెరికా, అవెంజర్స్ సిరీస్ వంటి సూపర్ హిట్స్ తెరకెక్కించిన టాప్ డైరెక్టర్స్ హీరో ధనుష్ కోసం ఇండియాకు రావడమేంటీ అని ఆలోచిస్తు్న్నారా ? కానీ నిజమే.. కేవలం ధనుష్ కోసమే కాదండోయ్.. ఇండియన్ ఫిల్మ్ లవర్స్ కోసం కూడా (The Gray Man). ఈ విషయాన్ని స్వయంగా రస్సో బ్రదర్స్ వెల్లడించారు. వారు తెరకెక్కించిన ది గ్రే మ్యాన్ సిరీస్ జూలై 22న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈక్రమంలోనే ది గ్రే మ్యాన్ టీమ్.. డైరెక్టర్స్ రస్సో బ్రదర్స్ భారత్ రావడం గురించి అధికారికంగా ప్రకటన చేసింది. ధనుష్‌ను చూసేందుకు భారత్ వస్తున్నామని.. అందుకు చాలా సంతోషంగా ఉందని రస్సో బ్రదర్స్ తెలిపారు.
ది గ్రే మ్యాన్ సిరీస్ లో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. అతి త్వరలో ముంబైలో ‘ది గ్రే మ్యాన్’ షో వేస్తున్నారు. ధనుష్ కోసం, భారతీయ ప్రేక్షకుల కోసం రూసో బ్రదర్స్ ఇండియా వస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన ‘ది గ్రే మ్యాన్’ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలవుతోంది. ఈ సందర్భంగా రూసో బ్రదర్స్ మాట్లాడుతూ ”హాయ్! మేం రూపొందించిన కొత్త సినిమా ‘ది గ్రే మ్యాన్’ ప్రదర్శనకు, మా స్నేహితుడు ధనుష్ ను చూసేందుకు ఇండియాకు వస్తుండటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో కలుద్దాం” అని అన్నారు.
‘ది గ్రే మ్యాన్’ సినిమా గురించి ధనుష్ మాట్లాడుతూ ”ఈ సినిమా జర్నీ ఒక రోలర్ కోస్టర్ రైడ్. యాక్షన్, డ్రామా, ఓ పెద్ద చేజ్… సినిమాలో అన్నీ ఉన్నాయి. గొప్ప గొప్ప వాళ్ళందరూ కలిసి చేసిన ‘ది గ్రే మ్యాన్’లో మంచి పాత్ర పోషించడం నాకు సంతోషంగా ఉంది” అని అన్నారు. మార్క్ గ్రీన్ రాసిన ‘ది గ్రే మ్యాన్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో రూసో బ్రదర్స్ ఈ సినిమాను రూపొందించారు. సినిమాకు తగ్గట్టుగా జో రుసో, క్రిస్టోఫర్ మార్కస్, స్టీఫెన్ మెక్ ఫీల్ స్క్రిప్ట్ రాశారు.