SSMB 28: మహేష్ సినిమాలో పెళ్లి సందడి బ్యూటీ.. శ్రీలీల ఏ పాత్రలో కనిపించనుందంటే..
వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటించనుందని ఫిల్మ్ వర్గల్లో టాక్ వినిపిస్తోంది.
అల.. వైకుంఠపురంలో సూపర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ నుంచి మరో మూవీ రాలేదు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కొత్త ప్రాజెక్ట్ షూరు చేశారు త్రివిక్రమ్ (Trivikram). ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కాబోతున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.
వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటించనుందని ఫిల్మ్ వర్గల్లో టాక్ వినిపిస్తోంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి హీరోయిన్ గా అరంగేట్రం చేసిన ఈ చిన్నది.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో తెలుగులో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం మాస్ మాహారాజా సరసన ధమాకా సినిమాలో నటిస్తోంది. ఇక లేటేస్ట్ అప్టేట్ ప్రకారం త్రివిక్రమ్ సినిమాలో మహేష్ మరదలు పాత్రలో ఆమె కనిపించనుందట. అంతేకాకుండా మహేష్, శ్రీలీలతో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని టాక్. దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్, మహేష్ కలయికలో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.