Prithviraj Sukumaran: పొరపాటున జరిగింది.. క్షమించండి.. స్పెషల్ నోట్ షేర్ చేసిన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్..
ఈసినిమాలో బుద్ది మాంద్యత కలిగిన పిల్లలను అవమానించేలా.. వారి సామర్థ్యాన్ని అవమానించేలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని.. వాటిని వెంటనే తొలగించాలంటూ డిజబుల్ చిల్డ్రన్ స్టేట్ కమీషనర్ కు కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన కడువా (Kaduva) సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈసినిమాలో బుద్ది మాంద్యత కలిగిన పిల్లలను అవమానించేలా.. వారి సామర్థ్యాన్ని అవమానించేలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని.. వాటిని వెంటనే తొలగించాలంటూ డిజబుల్ చిల్డ్రన్ స్టేట్ కమీషనర్ కు కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో డైరెక్టర్ షాజీ కైలాస్ తోపాటు.. చిత్ర నిర్మాతలకు నోటిసులు పంపారు. ఇక ఇదే విషయంపై కడువ సినిమా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు.
” క్షమించండి. ఇది పొరపాటున జరిగిందని మేము తెలియజేస్తున్నాము.. బుద్దిమాందత్వ పిల్లలను అవమానించేలా డైలాగ్స్ వచ్చాయి అంటున్నారు.. వారి తల్లిదండ్రులను బాధపెట్టే ఆ డైలాగ్స్ ఉపయోగించినందుకు క్షమాపణలు. నేను కూడా పిల్లలను ప్రేమించే తండ్రిని. వారికి చిన్న బాధ కలిగిన నాకు బాధ కలుగుతుంది. వికలాంగుల తల్లిదండ్రుల మానసిక స్థితిని నేను అర్థం చేసుకోగలను. మిమ్మల్ని బాధపెట్టాలనేది మా ఆలోచన కాదు. కేవలం విలన్ క్యారెక్టర్ .. అతని క్రూరత్వం గురించి తెలుపుతూ ఆ ఎమోషన్ పండించేందుకు ఆ డైలాగ్ వాడాల్సి వచ్చింది..తప్ప మరే ఉద్దేశ్యం లేదు ” అంటూ స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు డైరెక్టర్ షాజీ కైలాస్.. ఆయన చేసిన నోట్ ను హీరో పృథ్వీరాజ్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ ప్రేక్షకులను క్షమాపణలు కోరారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌పై సుప్రియా మీనన్ నిర్మించిన కడువలో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా కూడా నటించారు . ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ కథానాయికగా నటించింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.