Kartik Aaryan: స్టార్ హీరోకి వింత అనుభవం..! నమ్మరా.. ఆధార్ కార్డ్ చూపించాలా..? అంటూ..
బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్‌కు విచిత్ర ఘటన ఎదురైంది. పబ్లిక్‌లో తిరుగుతున్న ఆయన్ని ఓ అభిమాని.. ‘మీరు కార్తిక్ ఆర్యనేనా?’ అని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో..
బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్‌కు విచిత్ర ఘటన ఎదురైంది. పబ్లిక్‌లో తిరుగుతున్న ఆయన్ని ఓ అభిమాని.. ‘మీరు కార్తిక్ ఆర్యనేనా?’ అని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో..కార్తీక్.. నమ్మటంలేదా.. ‘ఆధార్ చూపించాలా?’ అంటూ సరదాగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కార్తిక్ టైమింగ్‌కి ఫిదా అవుతున్నారు.‘భూల్ భులయా 2’తో (Bhool Bhulaiyaa 2) సూపర్ సక్సెస్ అందుకున్నారు కార్తిక్ ఆర్యన్. హారర్ కామెడీ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా సుమారు 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో.. చాలారోజుల తర్వాత బీటౌన్ బాక్సాఫీస్ కళకళలాడింది. ఈ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోన్న కార్తిక్ తాజాగా యూరప్ పర్యటనకు వెళ్లారు. అక్కడి వీధుల్లో సరదాగా తిరుగుతూ స్ట్రీట్‌ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తుండగా ఓ వ్యక్తి ఆయన్ని చూసి ‘‘సర్… మీరు హీరో కార్తిక్ ఆర్యన్ కదా? అచ్చం అలాగే ఉన్నారు… అన్నాడు. అందుకు కార్తిక్.. ‘‘అవును, మీరు నమ్మడం లేదా? నా ఆధార్ కార్డు చూపించమంటారా?’’ అంటూ చమత్కరించారు. కార్తిక్ సమాధానానికి ఆనందంతో పొంగిపోయాడు అతను. వెంటనే ఆర్యన్‌తో ఫొటోలు దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ‘కార్తిక్ మీ టైమింగ్ అదిరింది’, ‘కార్తిక్ మీరు చాలా సింపుల్, సరదాగా ఉన్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్.. విద్యార్ధుల ఆందోళన
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
మల్లన్న సన్నిధికి 'సాష్టాంగ' యాత్ర..
ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?

