AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: రానా మాటలతో కొండంత దైర్యం వచ్చిందట.. ఎమోషనల్ అయిన సాయి పల్లవి

సాయి పల్లవి.. ఇప్పుడు ఈపేరు టాలీవుడ్ , కోలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ అమ్మడు.

Sai Pallavi: రానా మాటలతో కొండంత దైర్యం వచ్చిందట.. ఎమోషనల్ అయిన సాయి పల్లవి
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Jul 12, 2022 | 8:30 AM

Share

సాయి పల్లవి(Sai Pallavi).. ఇప్పుడు ఈపేరు టాలీవుడ్ , కోలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ అమ్మడు. తన సహజ నటనతో అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించే సాయి పల్లవి ఇటీవలే విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రానా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.నక్షలైట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి నటన అందరిని కట్టిపడేసింది.ఇటీవల వరుసగా లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ , విరాటపర్వం సినిమాలతో ఆకట్టుకుంది సాయి పల్లవి. ఇప్పుడు ఈ భామ నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ గురించి అంతా చర్చిన్చుకుంటున్నారు. సాయి పల్లవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ గార్గి . గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ర‌విచంద్రన్‌ రామ‌చంద్రన్‌, ఐశ్వర్య ల‌క్ష్మీ, థామ‌స్ జార్జ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజిగా ఉంది సాయి పల్లవి. తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది.. సాయి పల్లవి మాట్లాడుతూ.. చిన్నతనంలో  ఏదైనా మంచి పని చేస్తే అమ్మానాన్నలకు చూపిస్తాం. అలా తమిళంలో చేసిన ఈ సినిమాను మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చాను అని అన్నారు. తమిళంలో సూర్యగారు .. ఉదయనిధి స్టాలిన్ గారు ఈ సినిమాను చూశారు. ఇంతమంచి సినిమా మిగతా భాషల్లోని ఆడియన్స్ కి చేరాలనే ఉద్దేశంతో తమ ప్రెస్ మీట్స్ లో ఈ సినిమాను గురించి మాట్లాడారు అని చెప్పుకొచ్చింది. అప్పుడు నేను రానా గారికి కాల్ చేసి ఈ సినిమాను తెలుగులో ప్రెజెంట్ చేస్తారా? అని అడిగాను. ‘నువ్వు  సినిమా చేశావంటేనే .. ఆ సినిమాలో విషయం ఉంటుందనే సంగతి నాకు తెలుసు. ఈ సినిమా పరంగా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తాను అని దైర్యం ఇచ్చారని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ఫోన్ లాక్కొని పరిగెత్తాడు.. కొద్ది దూరం వెళ్లి కుప్పకూలాడు!
ఫోన్ లాక్కొని పరిగెత్తాడు.. కొద్ది దూరం వెళ్లి కుప్పకూలాడు!
మిర్యాలగూడ సజీవ దహనం కేసులో ట్విస్ట్‌! అది ప్రమాదం కాదు.. స్కెచ్
మిర్యాలగూడ సజీవ దహనం కేసులో ట్విస్ట్‌! అది ప్రమాదం కాదు.. స్కెచ్
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు