Leena Manimekalai: ‘విచారణకు హాజరుకాకపోతే తీవ్ర చర్యలు’.. కాళీ డైరక్టర్‌కు కోర్టు ఆదేశాలు..

Leena Manimekalai: కాళీ మాత సిగెరెట్ తాగుతున్నట్టు ఉన్న ఫోటోను విడుదల చేసి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన దర్శకులు లీనా మణిమేకలైకు ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ హైకోర్టు టూరింగ్ టాకీస్ నిర్మాణ సంస్థకు తాజాగా సమన్లు జారీ చేసింది. దర్శకురాలు...

Leena Manimekalai: 'విచారణకు హాజరుకాకపోతే తీవ్ర చర్యలు'.. కాళీ డైరక్టర్‌కు కోర్టు ఆదేశాలు..
Follow us

|

Updated on: Jul 12, 2022 | 6:48 PM

Leena Manimekalai: కాళీ మాత సిగెరెట్ తాగుతున్నట్టు ఉన్న ఫోటోను విడుదల చేసి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన దర్శకులు లీనా మణిమేకలైకు ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ హైకోర్టు టూరింగ్ టాకీస్ నిర్మాణ సంస్థకు తాజాగా సమన్లు జారీ చేసింది. దర్శకురాలు విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఆగస్టు 6న ఎట్టి పరిస్థితుల్లో హాజరుకావాల్సిందేనని అల్టీమేటం జారీ చేసింది. ఒకవేళ విచారణకు హాజరుకాని పక్షంలో తీవ్ర చర్యలుంటాయని కోర్టు తెలిపింది. దీంతో ఇప్పుడీ అంశం చర్చనీయాంశంగా మారింది. మణిమేకలై విచారణకు హాజరవుతారా.? అయితే ఏం సమాధానం చెబుతారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే మణిమేకలై వ్యవహరంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చున్నారని సినీ విమర్శకులు భావిస్తున్నారు. కాళీ మాత సిగెరెట్ తాగుతున్నట్టు ఉన్న ఫోటో వివాదాస్పదమైన క్రమంలోనే తొలగించి ఉంటే సరిపోయేదని అభిప్రాయపడుతున్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆందోళన చేస్తున్న హిందూ సంఘాలకు సారీ చెబితే.. సమస్య అప్పుడే ముగిసేదని చెబుతున్నారు. అలా కాదని.. మరుసటి రోజు మరిన్ని వివాదాస్పద ఫోటోలను తన ట్విట్టర్‌లో షేర్ చేయడమే కోర్టు దాకా తెచ్చిందని బాహాటంగా చెబుతున్నారు. ఇలాంటి వ్యవహార శైలితో… డాక్యూమెంటరీలు తెరకెక్కించలేరని.. అన్ని వర్గాలను, పక్షాలను..దృష్టిలో ఉంచుకునే ఏదైనా చేయాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..