Thank You Trailer: ‘మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే, స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ గొప్పది’… ఆకట్టుకుంటోన్న థ్యాంక్యూ మూవీ ట్రైలర్‌..

Thank You Trailer: నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'థ్యాంక్యూ'. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో చైకి జోడిగా రాశీ ఖన్నా నటిస్తుండగా.. మాళవికా నాయర్‌, అవికాగోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన...

Thank You Trailer: 'మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే, స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ గొప్పది'... ఆకట్టుకుంటోన్న థ్యాంక్యూ మూవీ ట్రైలర్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 12, 2022 | 7:10 PM

Thank You Trailer: నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో చైకి జోడిగా రాశీ ఖన్నా నటిస్తుండగా.. మాళవికా నాయర్‌, అవికాగోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ సినిమాకు పాజిటివ్‌ బజ్‌ను తెచ్చిపెట్టాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 22న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.

టీజర్‌తోనే సినిమా లైన్‌ ఎంటో చెప్పేసిన మేకర్స్‌ ట్రైలర్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. తాను నమ్మిన దాని కోసం కాంప్రమైజ్‌ అవ్వని పాత్రలో చైతన్య ఆకట్టుకుంటున్నాడు. ఇక ట్రైలర్‌లో వచ్చే డైలాగ్‌లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చై చెప్పే..  ‘మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే, స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ గొప్పది’, ‘మనం ఎక్కడ మొదలయ్యమో మర్చిపోతే, మనం చేరిన గమ్యానికి విలువ ఉండదు’ వంటి డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. ఎమోషనల్ లవ్ జర్నీలా సినిమా ఉండేలా కనిపిస్తోంది.

చైతన్య ఈ సినిమాలో పూర్తి స్థాయిలో స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మరి ఎన్నో అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో తెలియాలంటే జూలై 8వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

థ్యాంక్యూ ట్రైలర్ లాంచ్ లైవ్ వీడియో..

థ్యాంక్యూ మూవీ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..