AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna : నాగార్జున 100వ సినిమా కోసం కసరత్తులు.. దర్శకుడు అతడేనా..

అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

Nagarjuna : నాగార్జున 100వ సినిమా కోసం కసరత్తులు.. దర్శకుడు అతడేనా..
Nagarjuna
Rajeev Rayala
|

Updated on: Jul 13, 2022 | 6:35 AM

Share

అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున(Nagarjuna )ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. నాగ్ ఇద్దరు కుమారులు చైతన్య, అఖిల్ హీరోలుగా రాణిస్తున్నప్పటికీ నాగ్ మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగ్. ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టారు నాగార్జున. కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించిన విషయం తెలిసిందే. బంగార్రాజు సినిమా తర్వాత నాగ్ ఇప్పుడు బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించనున్నారు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రవీణ్ సత్తారుతో గోస్ట్ మూవీ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవలే ఈ సినిమానుంచి విడుదల చేసిన గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగార్జున వందో సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. నాగార్జున 100 సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారట. ఇందుకోసం ఇప్పటినుంచే దర్శకులను కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అయితే నాగ్ వందవ సినిమా తమిళ్ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ లో చేయనున్నారని తెలుస్తోంది. మోహన్ రాజా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో గాడ్ ఫాదర్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే నాగ్ తో మోహన్ రాజా చేసే సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో నాగచైతన్య, అఖిల్ కూడా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..
దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..
నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ