AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: వామ్మో.. స్టైలీష్ కాదు బాస్.. ధర తెలిస్తే మైండ్ బ్లాంకే.. సమంత లగ్జరీ ‘బల్గారీ’ వాచ్ విలువ ఎంతంటే..

ఈ క్రమంలోనే గత నాలుగు రోజులుగా స్టైలీష్ లుక్స్ లో వరుస ఫోటోషూట్స్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది సామ్. ఈవెంట్స్, పార్టీలలో తన స్టైల్‌తో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవలే ఓ ఈవెంట్‌లో సమంత తన సన్నిహితురాలు క్రేషా బజాజ్ రూపొందించిన అద్భుతమైన పాస్టెల్ గ్రీన్ కో-ఆర్డ్ సెట్‌తో అభిమానులను అలరించింది.

Samantha: వామ్మో.. స్టైలీష్ కాదు బాస్.. ధర తెలిస్తే మైండ్ బ్లాంకే.. సమంత లగ్జరీ 'బల్గారీ' వాచ్ విలువ ఎంతంటే..
Samantha
Rajitha Chanti
|

Updated on: Sep 29, 2024 | 9:22 AM

Share

చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే మరోసారి అడియన్స్ ముందుకు వస్తుంది హీరోయిన్ సమంత. అటు సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తున్న సామ్.. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ టీమ్ మెంబర్స్‏తో సందడి చేసింది. సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. అలాగే తాజాగా సినీరంగంలో హీరోయిన్స్ ప్రతిష్టాత్మకంగా భావించే ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకుంది. ఈ శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగిన ఐఫా 2024 వేడుకలలో ఈ పురస్కారాన్ని అందుకుంది సామ్. దీంతో ఆమెకు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే గత నాలుగు రోజులుగా స్టైలీష్ లుక్స్ లో వరుస ఫోటోషూట్స్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది సామ్. ఈవెంట్స్, పార్టీలలో తన స్టైల్‌తో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవలే ఓ ఈవెంట్‌లో సమంత తన సన్నిహితురాలు క్రేషా బజాజ్ రూపొందించిన అద్భుతమైన పాస్టెల్ గ్రీన్ కో-ఆర్డ్ సెట్‌తో అభిమానులను అలరించింది.

గ్రీన్ స్టైలీష్ డ్రెస్సుకు తగినట్లుగా బంగారు చెవిపోగులను ధరించి మరింత స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇక తన లుక్ కు తగినట్లుగా విలాసవంతమైన బల్గారీ సర్పెంటీ వాచ్ ధరించింది. ఈ వాచ్ సామ్ లుక్ ను మరింత అందంగా మార్చేశాయి. దీంతో ఆ వాచ్ ధర గురించి తెలుసుకోవడానికి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. నివేదికల ప్రకారం సమంత ధరించిన లగ్జరీ బల్గారీ వాచ్ ధర రూ.45.5 లక్షలు అని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సామ్ ఇటీవలే లండన్‌లోని సిటాడెల్ వరల్డ్ పార్టీకి హాజరయ్యారు. అక్కడ ఆమె మరోసారి అందరి లుక్ ను తనవైపు తిప్పుకుంది. ఈసారి క్రేషా బజాజ్ రూపొందించిన అధునాతన నేవీ-బ్లూ డ్రెస్ లో కనిపించింది. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సామ్.. సినిమాలు తగ్గించింది. నిత్యం యోగా, మెడిటేషన్ చేస్తూ తన ఫాలోవర్లకు సైతం ఆరోగ్య సూచనలు ఇస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us