Jani Master: ముగిసిన జానీ మాస్టర్ పోలీసు కస్టడీ.. చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు..

జానీమాస్టర్‌ మాత్రం ఎన్నిసార్లు ప్రశ్నించినా... ఆ యువతి చెప్పేవన్నీ అబద్దాలని జానీమాస్టర్ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ యువతి ద్వారా ఎవరో తనపై పెద్ద కుట్రకు ప్లాన్‌ చేశారని జానీమాస్టర్ పోలీసుల ముందు చెప్పినట్లు సమాచారం. ఇక నాలుగు రోజుల పోలీస్‌ కస్టడీ ముగియడంతో... ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచి ఆతర్వాత చంచల్‌గూడ జైలుకు జానీమాస్టర్‌ను తరలించారు పోలీసులు.

Jani Master: ముగిసిన జానీ మాస్టర్ పోలీసు కస్టడీ.. చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు..
Jani Master
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 29, 2024 | 9:04 AM

అత్యాచార ఆరోపణలు ఎదుర్కోంటూ.. పోక్సో కేసులో అరెస్టయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ నాలుగు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. ఈ కేసులో అతడిని నాలుగు రోజులపాటు నార్సింగీ పోలీసులు విచారించారు. కస్టడీలో జానీ మాస్టర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను ముందుంచి… జానీ మాస్టర్‌ను ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన యువతిలో ఉన్న రిలేషన్‌ ఏంటి…? ఆమెతో పరిచయం ఎలా ఏర్పడింది…? ఎన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి పనిచేశారు…? ఇలా ఎన్నో ప్రశ్నలు జానీమాస్టర్‌ ముందుంచారు పోలీసులు. అయితే జానీమాస్టర్‌ మాత్రం ఎన్నిసార్లు ప్రశ్నించినా… ఆ యువతి చెప్పేవన్నీ అబద్దాలని జానీమాస్టర్ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ యువతి ద్వారా ఎవరో తనపై పెద్ద కుట్రకు ప్లాన్‌ చేశారని జానీమాస్టర్ పోలీసుల ముందు చెప్పినట్లు సమాచారం. ఇక నాలుగు రోజుల పోలీస్‌ కస్టడీ ముగియడంతో… ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచి ఆతర్వాత చంచల్‌గూడ జైలుకు జానీమాస్టర్‌ను తరలించారు పోలీసులు.

ఇటు యువతిపై ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు జానీమాస్టర్‌ భార్య సుమలత. కొరియోగ్రాఫర్‌గా ఎదగడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఫ్యామిలీని వదిలేసి తన కోసం రావాలని జానీ మాస్టర్‌ను టార్చర్‌ పెట్టేదని షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని.. ఆమె పేరెంట్సే మాస్టర్‌పై ఒత్తిడి తెచ్చేవారని తెలిపారు. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందన్నారు. ఫిలిం ఛాంబర్ వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు సుమలత.

జానీ మాస్టర్‌ కేసులో టెక్నికల్‌ ఎవిడెన్స్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు జానీ మాస్టర్‌ బెయిల్‌ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. మరోవైపు జానీ మాస్టర్ నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో ఆతడిని రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. దీంతో వచ్చే నెల 3 వరకు అతడికి జ్యూడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జానీ మాస్టర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.