Rashmika Mandanna: రష్మిక, సల్మాన్ సినిమా షూటింగ్ సగంలోనే ఆగిపోయిందా..? కారణం ఇదేనా..

డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే అంతలోనే ఈ ప్రాజెక్ట్ కష్టాల్లో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అక్కడ గోరేగావ్‌లో ఈ సినిమా సెట్‌ను వేశారు. అయితే భారీ వర్షం కారణంగా సెట్స్ ధ్వంసమయ్యాయని.. దీంతో షూటింగ్ సగంలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది.

Rashmika Mandanna: రష్మిక, సల్మాన్ సినిమా షూటింగ్ సగంలోనే ఆగిపోయిందా..? కారణం ఇదేనా..
Rashmika, Salman Khan
Follow us

|

Updated on: Sep 29, 2024 | 8:27 AM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్న ఈ బ్యూటీ.. మరోవైపు హిందీలో వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసేందుకు కూడా సై అంటోంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ మూవీలో రష్మిక నటిస్తుంది. డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే అంతలోనే ఈ ప్రాజెక్ట్ కష్టాల్లో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అక్కడ గోరేగావ్‌లో ఈ సినిమా సెట్‌ను వేశారు. అయితే భారీ వర్షం కారణంగా సెట్స్ ధ్వంసమయ్యాయని.. దీంతో షూటింగ్ సగంలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది.

ఆగస్ట్ నుంచి ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. కొన్ని రోజులుగా ముంబై అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లైటింగ్ పరికరాలు పాడయ్యాయని.. ఆ కారణంగానే సినిమా తాత్కాలికంగా ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తుంది. సాయంత్ర 5 గంటలకు సల్మాన్ ఖాన్ రాగా.. రాత్రి షూట్ చేయాల్సి ఉంది. కానీ అప్పటికీ వర్షం ఎక్కువ కావడంతో చిత్రయూనిట్ షూటింగ్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ చేయానున్నారని.. ఇలాగే వాతావరణం కొనసాగితే కుదరదని టీమ్ అంటున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సికిందర్ సినిమాపై సల్మాన్ ఖాన్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా వచ్చే ఈద్‌కి విడుదల కానుంది. అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే మొదటిసారి సల్మాన్ ఖాన్ సరసన రష్మిక కనిపించనుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత డైరెక్టర్ అట్లీతో సల్మాన్ ఓ సినిమా చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక