Bigg Boss 8 Telugu: నిఖిల్ పై ఎక్కువ కంప్లైయింట్స్.. అడ్డంగా వాదించిన సోనియా.. బ్రేక్‌లో మరీ ఓవరాక్షన్..
సోనియాను లేపి ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్ను విష్ణు ఒక మాట అంటే అడల్ట్ రేటింగ్ కామెడీ అంటూ పెద్ద గొడవ చేశావు.. మరీ నామినేషన్స్ లో నువ్వు మాట్లాడింది ఏంటీ ? అంటూ వీడియో ప్లే చేశారు. నిఖిల్, పృథ్వీలను చూడడం మానేస్తే మంచిది అంటూ యష్మీపై సోనియా మాట్లాడిన మాటలకు అర్థం అడిగారు. ఇక ఎప్పటిలాగే తన వెర్షన్ చెప్పింది సోనియా. నిఖిల్ కూడా తప్పుగానే తీసుకున్నాడని.. కానీ తన ఉద్దేశ్యం అది కాదంటూ చెప్పుకొచ్చింది.
శనివారం ఎపిసోడ్లో సోనియా, నిఖిల్ టీంకు గట్టిగానే ఇచ్చిపడేశాడు నాగ్. హౌస్ మొత్తం నిఖిల్ ఫ్లిప్ అవుతున్నాడని.. పప్పులా గేమ్ ఆడుతున్నాడని చెప్తున్నప్పటికీ.. తన ఆట పై ఏమాత్రం దృష్టి పెట్టట్లేదు నిఖిల్. ముందుగా హీరో, జీరో అనే గేమ్ పెట్టగా.. అందులో ఎక్కువ హౌస్మేట్స్ నబీల్ హీరో అన్నారు. హ్యాండ్ సర్జరీ అయిన బెలూన్ టాస్కులో అదరగొట్టాడని.. ప్రతి టాస్కులో స్ట్రాంగ్ గా ఆడుతున్నాడని తమ వెర్షన్స్ చెప్పారు. ఇక జీరో అంటే మణికంఠ అని.. తనకు సపోర్ట్ చేసినవాళ్లనే బయటకు పంపాలని చూస్తుంటాడని.. అబద్ధాలు చెప్తున్నాడంటూ రీజన్స్ చెప్పారు. దీంతో నబీల్ పై ప్రశంసలు కురిపించారు నాగ్. ఆ తర్వాత వీడియో చూపించి మరీ మణికి క్లాస్ తీసుకున్నారు. సెల్ఫ్ శాక్రిఫైజ్ అవసరమా.. ఎందుకు అంత ఓవర్ థింకింగ్ అని అడిగారు. ఇక ఆ తర్వాత సోనియాను లేపి ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్ను విష్ణు ఒక మాట అంటే అడల్ట్ రేటింగ్ కామెడీ అంటూ పెద్ద గొడవ చేశావు.. మరీ నామినేషన్స్ లో నువ్వు మాట్లాడింది ఏంటీ ? అంటూ వీడియో ప్లే చేశారు. నిఖిల్, పృథ్వీలను చూడడం మానేస్తే మంచిది అంటూ యష్మీపై సోనియా మాట్లాడిన మాటలకు అర్థం అడిగారు. ఇక ఎప్పటిలాగే తన వెర్షన్ చెప్పింది సోనియా. నిఖిల్ కూడా తప్పుగానే తీసుకున్నాడని.. కానీ తన ఉద్దేశ్యం అది కాదంటూ చెప్పుకొచ్చింది. ఇక నిఖిల్, పృథ్వీ కూడా లేచి సోనియా ఉద్దేశ్యం అది కాదని మాకు తర్వాత చెప్పిందని చెప్పాడు.
దీంతో ప్రేరణ లేచి దీని వల్లే ఎవరూ ఆ క్లాన్ కు వెళ్లలేదు.. ఎవరు ఎంతలా చెప్పినా.. క్లియర్ గా కనిపించినా దాన్ని కూడా కవర్ చేసి కూర్చుంటారు అని చెప్పడంతో కాదు కాదు అంటూ ముగ్గురు తల అడ్డంగా ఊపారు. విష్ణు ఏం అనకుండానే అడల్ట్ రేటింగ్ అన్న నువ్వు.. మరీ నువ్వు మాట్లాడేప్పుడు ఆలోచించాలి కదా.. నిఖిల్, పృథ్వీ మీరు ఏమి అర్థం చేసుకోకుండా మీ ఆట పాడు చేసుకోండి.. సోనియా ఆట కూడా పాడు చేసుకోండి అంటూ హింట్ ఇచ్చారు. కానీ ఆ ఇద్దరూ ఆ హింట్ గమనించినట్లు కూడా కనిపించలేదు. ఇక సోనియా పెద్ద ఎక్స్ప్లనేషన్ ఇచ్చింది. నిఖిల్, పృథ్వీల ఆటే చూస్తున్నావ్.. నా ఆట కూడా చూస్తే తెలుస్తుంది అనే ఉద్దేశ్యంతో అన్నాను అంటూ కవర్ చేసింది. అదే నిజమైతే నామినేషన్స్ అయ్యాక అంతగా గొడవ జరుగుతుంటే ఎందుకు చెప్పలేదంటూ యష్మీ కరెక్ట్ పాయింట్ తీసింది. పక్కకు వెళ్లాక నిఖిల్, పృథ్వీలకు చెప్పిన రీజన్ నాకు వచ్చి ఎందుకు చెప్పలేదంటూ క్వశ్చన్ చేసింది. ఇక ఎప్పటిలాగే మరింత సాగదీస్తూ సోది చెప్పింది సోనియా.
నేను ఇద్దరిని వాడుకుంటున్నా అనేసరికి నాకు ఏదోలా అయిపోయింది అంటూ మాట్లాడుతుండగా.. నువ్వు అక్కడ ఆట అనే పదం చెప్పకపోవడం తప్పు అంటూ నాగ్ అన్నారు. ఇక సోనియా, యష్మీ వెర్షన్ విన్న తర్వాత సోనియా తప్పు మాట్లాడావ్.. ఇంకోసారి ఇలా కాకూడదు అని అన్నాడు నాగ్. ఆ తర్వాత నాగార్జున బ్రేక్ ఇచ్చిన సమయంలో సోనియా ఓవరాక్షన్ చేసింది. మళ్లీ సీత దగ్గరకు వెళ్లి.. అక్కడ అన్ని మాటలు మాట్లాడటం అవసరమా.. నిఖిల్ ఇన్ ఫ్లుయెన్స్ అయ్యాడు అంటూ ఏదేదో చెబుతున్నావ్ అంటూ సీతపై సీరియస్ అయ్యింది. దీంతో సీత కూడా గట్టిగానే కౌంటరిచ్చింది. నాకు అనిపించింది చెప్పిన.. నీతో నాకు ప్రాబ్లమ్ కాదు.. నిఖిల్ తో ప్రాబ్లమ్.. అదే చెప్పాను.. కానీ నువ్వు మధ్యలోకి వస్తున్నావ్.. నువ్వెందుకు మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నావ్ అని సీత కరెక్ట్ గా అడగడంతో మళ్లీ కవర్ చేసింది సోనియా. ఆ తర్వాత నాగార్జున బ్రేక్ కు వచ్చేలోపు ఇంత గొడవ.. ఏ నిఖిల్ నీ గురించి నువ్వు మాట్లాడలేవా అని నాగ్ అడగడంతో మాట్లాడతా సార్ అని అన్నాడు నిఖిల్. మొత్తానికి సోనియా, నిఖిల్ ఇద్దరికీ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.