Bigg Boss 8 Telugu: నిఖిల్‌కు నాగార్జున క్లాస్.. హౌస్‌లో హీరో నబీల్.. జీరో అతడే..
నబీల్ తన దృష్టిలో పృథ్వీ హీరో అని.. మణికంఠ జీరో అంటూ చెప్పాడు. మూడు గంటలు ఫేస్ మీద చిరునవ్వు పోకుండా.. పాటలు పాడకుంటూ ఆడావ్ గ్రేట్ అంటూ నాగ్ అన్నారు. మణికంఠ సపోర్ట్ చేసేవాళ్లలోనే నెగిటివ్ తీసుకుని నామినేట్ చేస్తుంటాడు అంటూ నబీల్ చెప్పాడు. ఆ తర్వాత మణికంఠకు క్లాస్ తీసుకున్నారు నాగ్. ఎందుకు అంతగా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు.. ఓ స్టాండ్ ఉంటే దాని మీదే నిలబడు అంటూ సీరియస్ అయ్యాడు నాగ్.
బిగ్‌బాస్ శనివారం ఎపిసోడ్ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు నాగార్జున. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్లో సోనియా, నిఖిల్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఈ ముగ్గురి గేమ్ మార్చుకోవాల్సిందే అంటూ హింట్ కూడా ఇచ్చేశారు. కానీ ఎప్పటిలాగే నాగార్జునతో అడ్డంగా వాదించింది సోనియా. వచ్చిరావడంతోనే హీరో జీరో గేమ్ ఆడించాడు నాగ్. ముందుగా మణికంఠ.. సీత హీరోలా గేమ్ ఆడుతుందని.. నైనిక జీరో అయిపోతుందని చెప్పాడు. 200 పర్సెంట్ కరెక్ట్ అన్నాడు నాగ్. ఆ తర్వాత యష్మీ వచ్చేసి తనకు నబీర్ హీరో అని.. నైనిక జీరో అని చెప్పేసింది. ఇక నబీల్ తన దృష్టిలో పృథ్వీ హీరో అని.. మణికంఠ జీరో అంటూ చెప్పాడు. మూడు గంటలు ఫేస్ మీద చిరునవ్వు పోకుండా.. పాటలు పాడకుంటూ ఆడావ్ గ్రేట్ అంటూ నాగ్ అన్నారు. మణికంఠ సపోర్ట్ చేసేవాళ్లలోనే నెగిటివ్ తీసుకుని నామినేట్ చేస్తుంటాడు అంటూ నబీల్ చెప్పాడు. ఆ తర్వాత మణికంఠకు క్లాస్ తీసుకున్నారు నాగ్. ఎందుకు అంతగా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు.. ఓ స్టాండ్ ఉంటే దాని మీదే నిలబడు అంటూ సీరియస్ అయ్యాడు నాగ్.
ఇక తర్వాత ఆదిత్య తన వరకు హీరో నిఖిల్, మణికంఠ జీరో అని చెప్పాడు. నైనిక తనకు సీత హీరో అని.. మణికంఠ జీరో అని చెప్పింది. ప్రేరణ తన వరకూ నబీల్ హీరో అని.. జీరో నిఖిల్ అని చెప్పింది. నిఖిల్ పప్పులా ఆడుతున్నాడా లేక స్ట్రాటజీనా అనేది తెలీడం లేదని చెప్పింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకూడదని.. అందరం కలిసి ఆడాలని మాతో చెప్పి.. ఆ తర్వాత క్లాన్ మంచి కోసం అంటూ నబీల్ ను ఆట నుంచి తీసేశాడు అంటూ చెప్పింది. దీంతో నిఖిల్ కు క్లారిటీ అడిగాడు నాగ్. దీనికి మిస్ బ్యాలెన్స్ అయ్యింది సార్ అని నిఖిల్ చెప్పగా.. మిస్ బ్యాలెన్స్ కావడానికి ఏ మిస్ కారణం అంటూ ఇండైరెక్ట్ గా సోనియాకు సెటైర్ వేశారు. ఆ తర్వాత వెంటనే సీత లేచి నిఖిల్ గురించి చెప్పుకొచ్చింది. ఈజీగా ఫ్లిప్ అయిపోయినట్లు అనిపించిందని.. ముగ్గురు కలిసే మాట్లాడుతున్నారంటూ సీత చెప్పింది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో మాట చెప్తున్నావ్.. అది టెంపరెరీగా ఉపయోగపడుతుంది.. తర్వాత నిన్ను నారద అంటారు అంటూ క్లా్స్ తీసుకున్నారు.
సోనియా తన హీరో పృథ్వీ అని.. జీరో మణికంఠ అంటూ చెప్పింది. సీత తన హీరో నబీల్ అని.. నిఖిల్ జీరో అని చెప్పింది సీత. నిఖిల్ ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతున్నాడంటూ చెప్పింది. సీతకు నువ్వు ఇష్టం.. కానీ రోజు రోజుకీ జీరో అయిపోతున్నావ్ అని చెప్పాడు నాగ్. నా ఆట మార్చుకుంటానని చెప్పాడు నిఖిల్. పృథ్వీ తనకు హీరో నబీల్ అని..తనకు చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడని చెప్పాడు. జీరో మణికంఠ అని.. శాక్రిఫైజింగ్ విషయంలో మా త్యాగం అని.. కాంతార టీమ్ దగ్గరకు వెళ్లి వాళ్ల డెసిషన్ అని చెప్పాడు అది అబద్ధం అంటూ పృథ్వీ చెప్పాడు. ఇక చివరగా నిఖిల్ తన హీరో పృథ్వీ అని.. జీరో మణికంఠ అన్నారు. ఇక ఎక్కువగా హీరోగా నబీల్ కు రావడంతో అతడికి కబాబ్ పంపించారు. జీరో మణికంఠకు రావడంతో అతడు నేరుగా డేంజర్ జోన్లో ఉన్నాడంటూ డైరెక్టర్‌గా చెప్పేశాడు నాగ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.