Samantha: వేదికపై ఏడ్చేసిన సమంత.. కన్నీళ్లతోనే స్పీచ్.. వీడియో వైరల్..
చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే సినీరంగంలో తిరిగి యాక్టివ్ అవుతుంది హీరోయిన్ సమంత. ఇటీవల శుభం సినిమాతో నిర్మాతగా సక్సెస్ అయ్యింది. అలాగే ఇదే సినిమాలో అతిథి పాత్రలో మరోసారి వెండితెరపై సందడి చేసింది. అలాగే మరిన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా తానా సభలలో కన్నీళ్లు పెట్టుకుంది.

తానా 24వ మహాసభలు మూడు రోజు సైతం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే సామ్ మాట్లాడుతూ.. ఈ వేదికపై నిలబడే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు సమంత. అలాగే తాను ప్రతి సంవత్సరం తానా గురించి వింటూనే ఉన్నానని. ఏ మాయ చేశావే సినిమా నుంచే తమలో ఒకరిగా చూసిన తెలుగు వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే తాను ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా తెలుగు వారు ఏమనుకుంటారు ? అని ఆలోచిస్తానని అన్నారు. ఈ క్రమంలో వేదికపై మాట్లాడుతూ సమంత భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
సమంత మాట్లాడుతూ.. “ఈ వేదికపై నిలబడటానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. ప్రతి సంవత్సరం తానా గురించి వింటూనే ఉంటాను. నా మొదటి సినిమా ఏ మాయ చేసావే సినిమా నుంచి మీకు ధన్యవాదాలు చెప్పే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. నా మొదటి సినిమా నుండే మీరు నన్ను మీ సొంతం చేసుకున్నారు. మీరు నాకు ప్రేమను మాత్రమే ఇచ్చారు. ఇక్కడికి వచ్చి ధన్యవాదాలు చెప్పడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. ఇది నా కెరీర్‌లో ఒక ముఖ్యమైన దశ. నా మొదటి ప్రొడక్షన్ శుభమ్, దానిని ఎక్కువగా అభినందించిన వ్యక్తులు ఉత్తర అమెరికాకు చెందినవారు. నేను తీసుకునే ఏ నిర్ణయం అయినా ముందు తెలుగు ప్రేక్షకుల గురించి ఆలోచిస్తాను.
నా కెరీర్‌లో నిర్ణయం తీసుకునే ముందు నాకు వచ్చే మొదటి ఆలోచన అదే. మీరు నాకు ఒక గుర్తింపు ఇచ్చారు. నాకు సొంతిల్లు తెలుగు. నేను నిజంగా చెప్పాలనుకుంటున్నాను. ఓ బేబీ మిలియన్ డాలర్లు సంపాదించానని గుర్తుంది. నేను దానిని నమ్మలేకపోయాను. మీరు నాకు దూరంగా ఉన్నప్పటికీ నా హృదయంలో మాత్రం ఉన్నారు. మీకు కృతజ్ఞురాలిని”అంటూ చెప్పుకొచ్చారు.
Actress #Samantha got emotional during her speech at TANA Conference 2025. pic.twitter.com/LV6SBVZZ5g
— Whynot Cinemas (@whynotcinemass_) July 6, 2025
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..