- Telugu News Photo Gallery Cinema photos Can You Guess who is Charges Highest Remuneration per movie in tollywood, She Is Priyanka Chopra
Telugu Cinema: ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్.. తెలుగు సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ఎవరంటే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో తెగ వైరలవుతుంది. అమాయకమైన చూపులు.. చక్కని చిరునవ్వుతో చెట్టెక్కి కూర్చున్న ఈ చిన్నారి.. ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో తోపు హీరోయిన్. అంతేకాదు.. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఏకైక హీరోయిన్. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీలో నటిస్తుంది.
Updated on: Jul 06, 2025 | 11:20 AM

ఈ చిన్నారి సైన్యంలో వైద్యులుగా పనిచేసిన దంపతుల కుమార్తె . మాజీ మిస్ ఇండియా. బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో తనదైన ముద్ర వేసిన గ్లోబల్ స్టార్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఈ అమ్మడు చిన్ననాటి చిత్రం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా, తల్లి మధు చోప్రా సైన్యంలో వైద్యులుగా పనిచేశారు. ప్రియాంక చోప్రా 18 సంవత్సరాల వయసులో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది.

ప్రియాంక తండ్రి కుటుంబం ఆమె చదువును వదిలి పూర్తిగా భిన్నమైన కెరీర్‌ను ఎంచుకోవడానికి వ్యతిరేకించింది. ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా సంప్రదాయవాద వ్యక్తి అని ప్రియాంక తల్లి మధు చోప్రా గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. ప్రియాంక మిస్ ఇండియా పోటీలలో పాల్గొంది.

12వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలోనే బోస్టన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిందని.. దీంతో రెండు దేశాలలో చదువులు కొత్తగా ఉండడంతో ఆమె సంవత్సరంపాటు విరామం తీసుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో మిస్ ఇండియా పోటీలో పాల్గొని టైటిల్ గెలిచింది.

ఆ తర్వాత ప్రియాంక తమిళంలో విజయ్ దళపతి సరసన ఓ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ సినిమా కోసం ఆమె ఏకంగా రూ.40 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.




