AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubham Trailer : శుభం ట్రైలర్‏లో సర్ ప్రైజ్ చేసిన సామ్.. నిర్మాతగా మొదటి సినిమా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా మెప్పించిన సామ్.. ఇప్పుడు నిర్మాతగా మారింది. హీరోయిన్ గా ఇన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సామ్.. ఇప్పుడు తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. సమంత నిర్మాతగా మొదటి సినిమా శుభం. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Shubham Trailer : శుభం ట్రైలర్‏లో సర్ ప్రైజ్ చేసిన సామ్.. నిర్మాతగా మొదటి సినిమా..
Shubham Trailer
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2025 | 12:17 PM

Share

ఇన్నాళ్లు కథానాయికగా అలరించిన సమంత ఇప్పుడు నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే తిరిగి సినీరంగంలో యాక్టివ్ అవుతున్న సామ్.. అటు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలాగే ఇటు ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టింది. కొన్నాళ్ల క్రితమే ట్రాలాలా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది సామ్. ఇదిలా ఉంటే.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై టాలీవుడ్ హీరోయిన్ సమంత నిర్మాతగా నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని మే 9న విడుదల చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఆదివారం (ఏప్రిల్ 27) నాడు శుభం చిత్రం నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

శుభం ట్రైలర్‌ను గమనిస్తే.. ఊర్లోని మహిళలంతా కూడా సీరియల్‌ను చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంటారు. దెయ్యం పట్టినట్టుగా మహిళలు ప్రవర్తిస్తుంటే.. వారి నుంచి తప్పించుకునేందుకు ఊర్లో పురుషులంతా కూడా అష్టకష్టాలు పడుతుంటారు. అలాంటి తరుణంలో మాతాజీగా సమంత స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ట్రైలర్‌ మీద మరింత ఇంట్రెస్ట్ కలిగించేలా చేశారు.

శుభం ట్రైలర్‌ను చూస్తే ఈ చిత్రంలో హాస్యం, హర్రర్, ఉత్కంఠ, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాల్ని జోడించినట్టుగా కనిపిస్తోంది. శుభం మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. వివేక్ సాగర్ బీజీఎం స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం ప్రధాన ఆకర్షణ కానుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం