Suriya: నా తర్వాతి సినిమా ఆ టాలీవుడ్ డైరెక్టర్‌తోనే.. అధికారికంగా ప్రకటించిన హీరో సూర్య
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన చిత్రం రెట్రో. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య మాట్లాడాడు. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి క్లియర్ కట్ గా చెప్పేశాడు.

కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రెట్రో’. పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం, మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తుండటం విశేషం. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ‘రెట్రో’ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యతో తనకున్న అనుబంధాన్ని రౌడీ బాయ్ గుర్తు చేసుకున్నాడు. రెట్రో సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించాడు. అనంతరం చిత్ర కథానాయకుడు సూర్య మాట్లాడుతూ ముందుగా పహల్గాం బాధితులకు నివాళులు అర్పించారు. అనంతరం రెట్రో వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
‘ మీరు నాపై కురిపిస్తున్న ప్రేమ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ గారి సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. మేకింగ్ కొత్తగా ఉంటుంది. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. రెట్రో ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సంతోష్ నారాయణన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. అలాగే తెలుగులో శ్యామ్ గారు బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. ప్రకాష్ రాజ్ గారు, జోజు జార్జ్ గారు, జయరామ్ గారు, నాజర్ గారు లాంటి సీనియర్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. పూజ హెగ్డే నాకంటే ఎక్కువగా సినిమాని ప్రమోట్ చేస్తోంది. మీరు ట్రైలర్ లో చూసినట్టుగానే.. లవ్, కామెడీ, యాక్షన్, ఇంటెన్సిటీ అన్నీ సినిమాలో ఉంటాయి. మే 1న విడుదలవుతున్న రెట్రో మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నాగవంశీ గారిది లక్కీ హ్యాండ్ అంటుంటారు. ఆయనతో చేతులు కలపడం సంతోషంగా ఉంది. నా తదుపరి చిత్రాన్ని నాగవంశీ గారి నిర్మాణంలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది. మే 1న విడుదలవుతున్న నాని ‘హిట్-3’ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. విజయ్ నా సోదరుడు లాంటివాడు. విజయ్ జర్నీ చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. ‘కింగ్ డమ్’ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విజయ్ అగరం ఫౌండేషన్ గురించి మాట్లాడాడు. అయితే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. మా అగరం ఫౌండేషన్ కి ఎందరో తెలుగువారు అండగా ఉన్నారు. నాకు ఇన్నేళ్ళుగా సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్న నా అభిమాన సోదరులకు, సోదరీమణులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు’ అని సూర్య చెప్పుకొచ్చారు.
వీడియో ఇదిగో..
#Suriya46 💥💥@Suriya_offl – #VenkyAtluri – @Vamsi84 – @SitharaEnts ❤️🔥❤️🔥 🎥 pic.twitter.com/CD7XEkRz6h
— Sithara Entertainments (@SitharaEnts) April 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








