Samantha : సమంత కొత్త ప్రయాణం.. రాజ్ నిడిమోరుతో క్లోజ్ హగ్.. ఫోటోస్ వైరల్..
గత కొన్నాళ్లుగా టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇటీవలే మా ఇంటి బంగారం అనే కొత్త సినిమాను స్టార్ట్ చేసింది. ఇక తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అనేక రూమర్స్ వినిపిస్తున్న సమయంలో ఊహించని ఫోటోస్ షేర్ చేసింది.

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇటీవలే శుభం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో అతిథి పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. సామ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్ లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్ మధ్య శుక్రవారం సమంత షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా అందులో ఒక ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఆ ఒక్క ఫోటో నెట్టింట చర్చనీయాంశమైంది. అందులో సామ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో క్లోజ్ హగ్ తో కనిపించింది.
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..
తన పెర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో సమంత దిగిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటోతోపాటు పలువురితో దిగిన ఫోటోస్ పంచుకుంటూ తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు సామ్. “ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో.. గత ఏడాదిన్నరగా నా కెరీర్ లో సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్ తీసుకున్నా.. ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్న చిన్న.. విజయాలను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ప్రతిభావంతులైన కష్టపడి పనిచేసే వారితో కలిసి పనిచేస్తున్నందుకు కృతజ్ఞురాలిని. ఇది కేవలం ఆరంభమే” అంటూ రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..
సామ్.. విషయానికి వస్తే.. రాజ్, డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటడెల్ హనీ బన్నీలో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని తెలుస్తోంది. ఇన్నాళ్లు హీరోయిన్ గా మెప్పించిన సమంత.. శుభం సినిమాతో నిర్మాతగా మారింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?




