- Telugu News Photo Gallery Cinema photos Know About Gouri Kishan Who Stoop Up Against Body Shaming Become Internet Sensation
Gouri Kishan : ఒక్క రోజులోనే సోషల్ మీడియాలో సెన్సేషన్.. హీరోయిన్ గౌరీ కిషన్ గురించి తెలుసా.. ?
గౌరీ కిషన్.. సోషల్ మీడియాలో ఒక్క రోజులోనే సెన్సేషన్ అయ్యింది. ఇటీవల తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. అందులో ఓ రిపోర్టర్ తన బరువు గురించి ప్రశ్నించడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ టాపిక్ నెట్టింట చర్చనీయాంశమైంది.
Updated on: Nov 08, 2025 | 8:13 AM

తమిళంలో సూపర్ హిట్ అయిన 96 సినిమాతో సినీరంగంలో పాపులర్ అయ్యింది గౌరీ కిషన్. ఇదే చిత్రాన్ని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేయగా.. అందులో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

గౌరీ కిషన్ హీరోయిన్ గా నటిస్తున్న కొత్త సినిమా అదర్స్ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా యూనిట్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఓ రిపోర్టర్ నీ బరువు ఎంత అని ప్రశ్నించడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. వెయిట్ గురించి అడిగిన రిపోర్టర్ కు ఇచ్చిపడేసింది.

దీంతో ఇప్పుడు గౌరీ కిషన్ పేరు నెట్టింట మారుమోగింది. ఇప్పుడు ఈ అమ్మడు గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. 96 సినిమాలో చిన్నప్పటి త్రిష పాత్రలో కనిపించింది. కేరళలో జన్మించిన గౌరీ.. చెన్నైలోనే ఎక్కువగా గడిపింది. '96' తర్వాత గౌరీ కిషన్ చాలా సినిమాల్లో నటించింది.

ఇటీవలే గౌరీ కిషన్ నటించిన 'అదర్స్' సినిమా విడుదలైంది. ఆమె 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమాలో కూడా నటించింది. అలాగే తమిళంలో మాస్టర్, కర్ణన్, హాట్ స్పాట్ వంటి చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అదర్స్ సినిమాలో కథానాయికగా నటిస్తుంది.

ప్రస్తుతం గౌరీ కిషన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అలాగే ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అటు ట్రెడిషనల్, ఇటు గ్లామర్ ఫోజులతో నెట్టింట మత్తెక్కిస్తోంది ఈ వయ్యారి.




